ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ చిత్రాల ప్రభావం కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన స్కంద, పెదకాపు చిత్రాలు రాజకీయాల చుట్టూ తిరిగాయి. పెదకాపు కథ పూర్తిగా రాజకీయాల మీదే నడవగా.. ‘స్కంద’లో రాజకీయాల ప్రస్తావనతో బోలెడు పంచులు పేలాయి. ఇక ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మద్దతుతో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
గత ఎన్నికలకు ముందు యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలు వైసీపీకి ఉపయోగపడగా.. ఈసారి దాదాపుగా అలాంటి సినిమాలే రెడీ అవుతున్నాయి. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ తీసిన రామ్ గోపాల్ వర్మే ‘వ్యూహం’ అనే ప్రాపగండా మూవీ చేస్తున్నాడు. అలాగే వైఎస్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ తీసి మెప్పించిన మహి.వి.రాఘవ్ ఇప్పుడు వైఎస్ తనయుడు జగన్ మీద ‘యాత్ర-2’ చేస్తున్నాడు.
‘యాత్ర’తో పోలిస్తే ‘యాత్ర-2’ వ్యవహారమంతా కొంచెం పెద్ద స్థాయిలోనే కనిపిస్తోంది. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఇప్పటిదాకా రాజకీయాలు, వివాదాల జోలికి వెళ్లకుండా ఒక పంథాలో వెళ్లిపోతున్న యువి క్రియేషన్స్.. ప్రాపగండా ఫిలిం లాగే కనిపిస్తున్న ‘యాత్ర-2’తో అసోసియేట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇక ఈ సినిమాకు మధీ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్.. సంతోష్ నారాయణన్ లాంటి మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు పని చేస్తున్నారు. మధీ ‘శ్రీమంతుడు’ సహా ఎన్నో పెద్ద చిత్రాలకు పని చేశాడు. సంతోష్ నారాయణన్ తమిళంలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడు. అతను ప్రస్తుతం ప్రభాస్ సినిమా ‘కల్కి’కి కూడా పని చేస్తున్నాడు. ఇలాంటి టెక్నీషియన్లను పెట్టుకుని భారీ బడ్జెట్లోనే సినిమా తీస్తున్నాడు మహి రాఘవ్. అధికార పార్టీ సహాయ సహకారాలున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో అతడికి సమస్యలుండవు. మరి ఈ సినిమాను ఎంతమేర జనరంజకంగా తీస్తాడన్నదే చూడాలి.
This post was last modified on October 9, 2023 10:36 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…