తెలుగులో ప్రస్తుతం ఉన్న సంగీత దర్శకుల్లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ ఎవరు అంటే తమన్ అని చెప్పేయొచ్చు. కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్‌ను కూడా వెనక్కి నెట్టి వరుసబెట్టి భారీ సినిమాలు చేస్తున్నాడు. ఐతే టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు తరచుగా టార్గెట్ అవుతుంటాడు తమన్. అందుకు అతడి మీద ఉన్న ‘కాపీ’ ముద్రే కారణం. ఎక్కడెక్కడి నుంచో ట్యూన్లు పట్టుకొచ్చేస్తాడని.. ఒకే రకం మ్యూజిక్ ఇస్తాడని.. తన ట్యూన్లను, స్కోర్‌నే కాపీ కొడుతుంటాడని.. ఇలా చాలా విమర్శలే ఉన్నాయి తమన్ మీద.
మధ్యలో కొన్ని సినిమాలకు వైవిధ్యం చూపించిన తమన్.. ఈ మధ్య మళ్లీ ఒక మూసలో సాగిపోతున్నాడనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ‘స్కంద’ సినిమా విషయంలో తమన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. గత నెలలో వచ్చిన ‘ఓజీ’ టీజర్‌కు తమన్ ఇచ్చిన స్కోర్ విషయంలో మంచి స్పందన వచ్చినా అది కూడా కాపీ ట్యూన్ అంటూ నెటిజన్లు దాని ఒరిజినల్ చూపించి తమన్‌ను ట్రోల్ చేశారు.
తాజాగా తమన్‌కు మరోసారి కాపీ మరకలు అంటాయి. ఈసారి తన మ్యూజిక్‌నే తమన్ కాపీ కొట్టాడని నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు. నిన్న రిలీజైన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌కు ఎనర్జిటిక్ మ్యూజిక్కే ఇచ్చాడు తమన్. కానీ అందులో కొత్తదనం అయితే కనిపించలేదు. అందులో బాలయ్య ఇదీ మన సౌండ్ అంటూ ఒక డైలాగ్ చెబుతాడు. దానికి ముందు వినిపించే స్కోర్ ‘బ్రో’ సినిమాను గుర్తుకు చేస్తోంది.
బ్రో ఫస్ట్ టీజర్లో ‘బ్రో.. బ్రో’ అంటూ వినిపించే సౌండునే తమన్ రిపీట్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ మ్యూజిక్ బిట్ పట్టుకుని.. ‘బ్రో’ టీజర్‌తో పోలుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఒక సినిమా మ్యూజిక్ ఇంకో సినిమాకు వాడేస్తాడా.. రెంటికీ ఒకే సౌండింగ్ ఇస్తున్న విషయం కూడా తెలియదా అంటూ తమన్‌ను విమర్శిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాకు ఎన్నిసార్లు దొరికిపోతావ్ తమన్ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 9, 2023 6:47 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…