Movie News

వ‌ర్మపై సినిమా.. ఈసారి సెటైర్ కాదు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కొంద‌రు సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరిపోయి కొన్ని సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇది న‌చ్చ‌ని వాళ్లు ఆయ‌న మీద సినిమాలు తీయ‌డం మొద‌లుపెట్టారు. సీనియ‌ర్ లిరిసిస్ట్ జొన్న‌విత్తుల రామలింగేశ్వ‌ర‌రావుతో పాటు బిగ్ బాస్ ఫేమ్ నూత‌న్ నాయుడు వ‌ర్మ మీద సినిమాలు తీసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌రుస‌లో ఇంకో సినిమా కూడా త‌యారైంది. ఐతే ఈ చిత్రాలు వ‌ర్మ తీసిన సినిమాల కంటే నాసిర‌కంగా, సిల్లీగా అనిపించి ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేదు. ఐతే ఇప్పుడు వ‌ర్మ మీద మ‌రో సినిమా రాబోతోంది. అది పై సినిమాల కోవ‌లో సెటైర్ కాదు. షార్ట్ ఫిలిం టైపూ కాదు. వ‌ర్మ మీద సీరియ‌స్‌గా ఓ భారీ సినిమాను ప్లాన్ చేసింది ఈ చిత్ర బృందం. రాము పేరుతో ఈ సినిమా తెరకెక్క‌నుంది.

కాలేజీ కుర్రాడిగా వ‌ర్మ జీవితంతో మొద‌లుపెట్టి.. ఆ త‌ర్వాత సినీ ద‌ర్శ‌కుడిగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం.. ఇప్పుడు త‌న స్థాయికి ఏమాత్రం త‌గ‌ని సినిమాలు తీసే స్థాయికి చేర‌డం, వివాదాస్ప‌దుడిగా మార‌డం వ‌ర‌కు వ‌ర్మ మొత్తం జీవితాన్ని ఈ సినిమాలో చూపించ‌నున్నారు. ఇది మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఒక్కోటి రెండు గంట‌ల నిడివి ఉంటుంద‌ట‌. బొమ్మాకు క్రియేషన్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దొర‌సాయి తేజ అనే కొత్త దర్శ‌కుడు దీన్ని రూపొందిస్తున్నాడు. పార్ట్ 1 సినిమా కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్ట్ 26 న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

మొదటి భాగం లో 20 ఏళ్ల ఆర్జీవీ పాత్రలో ఒక యువ నటుడు నటించబోతున్నాడట‌, ఈ భాగం లో విజయవాడలో వ‌ర్మ‌ కాలేజ్ రోజులు, ఆయన ప్రేమలు, ఆర్జీవీ పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్, శివ సినిమా కోసం ఏం చేశాడు, రిలేషన్ షిప్స్ ను ఎలా వాడుకున్నాడు అనే అంశాలు చూపించనున్నారు. రెండవ పార్ట్ లో వేరే నటుడు నటిస్తాడ‌ట‌. వర్మ అండర్ వరల్డ్ తో ప్రేమాయణం, ముంబై జీవితం లో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ తో ఉన్న అనుబంధాలను తెరకెక్కించనున్నారు. పార్ట్ 3లో ఆర్జీవీ నే స్వయంగా నటించబోతుండ‌బోతుండ‌టం విశేషం. ఆర్జీవీ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళ పై, సెక్స్ పై, సమాజం పై ఉన్న అభిప్రాయాలతో పాటుగా, చాలామంది పై ఉన్న ఆర్జీవీ ప్రభావం గురించి చూపించనున్నారట‌.

This post was last modified on August 26, 2020 12:45 am

Share
Show comments
Published by
suman
Tags: RGV Biopic

Recent Posts

రానా ట్రోల్స్ గురించి నాని సలహా

ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…

24 mins ago

అక్కినేని బయోపిక్ మీద ప్రాక్టికల్ కోణం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…

1 hour ago

ప్రశాంత్ వర్మకు మొదటి షాక్ తగిలింది

నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…

2 hours ago

జమిలి వచ్చినా.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…

2 hours ago

బాలీవుడ్ బేబీకి హీరో దొరికాడు

ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…

2 hours ago