మొన్నేదో సునామి అలల్లాగా మీడియం సినిమాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తే అందులో మ్యాడ్ ఒక్కటే విజేత కాగా మిగిలినవి కనీసం బిజినెస్ ని వెనక్కు ఇచ్చేంత గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయాయి. ఫలితంగా విగ్రహం పుష్టి ఫలితం నష్టి లాగా మారిపోయింది బాక్సాఫీస్. సరే ఇలాంటి హెచ్చుతగ్గులు టాలీవుడ్ కు కొత్తేమి కాదు కాబట్టి తర్వాత వచ్చే శుక్రవారం కోసం ట్రేడ్ తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే చెప్పుకోదగ్గ నోటెడ్ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఏవైనా అద్భుతమైన టాక్ తెచ్చుకుంటే తప్ప థియేటర్ల దగ్గర జనాన్ని చూసే భాగ్యం దక్కేలా లేదు.
అక్టోబర్ 13 రాబోయేవన్ని చిన్న సినిమాలే. తంతిరం చాప్టర్ 1 టేల్స్ అఫ్ శివకాశి, మధురపూడి గ్రామం అనే నేను, రాక్షస కావ్యం, ప్రేమ యుద్ధం, ఒక్కడే 1 వెంకన్న ఆన్ డ్యూటీలు దిగుతున్నాయి. ఒక్కదానికి కనీసం బజ్ కాదు కదా ఇవి నిర్మాణం జరిగాయనే కనీస అవగాహన ప్రేక్షకుల్లో లేదు. జయం రవి నయనతారల గాడ్ కూడా అదే రోజు రానుంది. తమిళంలో ఆల్రెడీ డిజాస్టరైన ఈ మూవీని ఇక్కడేదో ఆదరించి పెద్ద మనసు చాటుకుంటారని అనుకోలేం. ఇవి కాకుండా స్టార్ క్యాస్టింగ్ లేని మూడు నాలుగు హిందీ సినిమాలు రేస్ లో ఉన్నాయి కానీ కనీసం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని రప్పించినా గొప్పే.
దసరాకు విపరీతమైన పోటీ ఉండటంతో ముందు వారాన్ని అనాథలా వదిలేశారు. భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు, గణపథ్ వచ్చాక థియేటర్లు దొరకడం గగనమే. అలాంటప్పుడు ఏడు రోజుల సంబరం ఎందుకులేనని మధ్య తరహా నిర్మాతలు సైలెంట్ అయ్యారు. ఇప్పటికే అద్దెలు సైతం గిట్టుబాటు కాక థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడుతుంటే ఈ పరిస్థితి ఇంకో వారం కొనసాగుతుందని ఊహించుకుంటేనే వాళ్లకు వణుకు పుడుతోంది. విజయదశమి దాకా దీన్ని దిగమింగుకోవాల్సిందే. బాలయ్య, రవితేజ, విజయ్ లు వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా లేరు. వేచి చూడాల్సిందే.
This post was last modified on October 8, 2023 8:18 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…