మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ఏ నిర్మాతైనా సినిమా చేస్తున్నప్పుడు ఆయన మీద అభిమానుల కళ్ళు నిత్యం ఉంటాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తారా అంటూ ట్విట్టర్ లో పోరు పెడుతూనే ఉంటారు. నాగవంశీ తన సోదరి హారిక కోసం మ్యాడ్ ని సమర్పించి దానికి సంబంధించిన ప్రమోషన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్లను తీసుకొచ్చి దాని మీద జానాల దృష్టి పడేలా చేశారు. మంచి థియేటర్లు దక్కేలా చూసుకున్నారు. హిట్ టాక్ తెచ్చుకోవడంతో దాన్ని మరింత బలపరిచే పనిలో ఉన్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ మ్యాడ్ ని ప్రమోట్ చేసుకోవడం నాగవంశీ ఉద్దేశమైతే ఆయనతో ముఖాముఖీ తీసుకున్న వాళ్ళందరూ గుంటూరు కారం గురించి ప్రశ్నల వర్షం కురిపించి వీలైనంత దాని విశేషాలను బయట పెట్టే ప్రయత్నం చేశారు. టాకీ పార్ట్ అక్టోబర్ 20 లోపు పూర్తి కావడం, వచ్చే నెలాఖరుకి పాటలు ఫినిష్ చేసేయడం, ఇప్పటిదాకా మహేష్ కెరీర్లో రానటువంటి బిగ్గెస్ట్ మాస్ సాంగ్ ఇందులో ఉందని హిట్ ఇవ్వడం, ఇంటర్వెల్ బ్లాక్ కు సంబంధించిన విశేషాలు, ఫ్యాన్స్ ఫీలింగ్స్ గురించి టీమ్ అభిప్రాయాలు ఇలా ఎన్నో సంగతులు ఆయన నుంచి ధారాళంగా వచ్చేశాయి.
అప్డేట్స్ కోసం మొహం వాచిపోయిన అభిమానులకు ఈ వీడియోలే కొండంత బలంగా మారాయి. వాటిలో సూర్యవంశీ ఇచ్చిన ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బువుతున్నారు. తమకు కావాల్సిన క్లిప్పులను కట్ చేసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దెబ్బకు మ్యాడ్ ముచ్చట్ల కన్నా గుంటూరు కారం కబుర్లు బాగా హైలైట్ అయ్యాయి. కాగల కార్యం ఎవరో నెరవేర్చినట్టు ఇంకొద్ది రోజులు మహేష్ ఫ్యాన్స్ వీటితో సరిపెట్టుకుంటారు. ఫస్ట్ ఆడియో సింగల్ పండక్కు అనౌన్స్ చేసి అక్కడి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టే ప్లానింగ్ లో ఉన్నారు హారిక అండ్ హాసిని.
This post was last modified on October 8, 2023 4:30 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం…
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక…
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత…
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన…
అధినేతలకు ప్రజలు అధికారాన్ని ఇస్తుంటారు. ఒకసారి ఒకరికి ఇస్తే మరోసారి ఇంకొకరికి ఇవ్వటం రివాజు. కొన్నిసార్లు మాత్రం కంటిన్యూగా పాలనాధికారాన్ని…