Movie News

మొదటి రోజే షోలు క్యాన్సిల్ .. హతవిధీ !

మాములుగా ఒక సినిమా టాక్ పూర్తిగా బయటికి వచ్చాక కలెక్షన్లు తగ్గడమో లేదా థియేటర్ల నుంచి తీసేయడమో జరుగుతుంది. ఇది సహజం. ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు. కానీ బోలెడు కొత్త చిత్రాలు రిలీజై మొదటి రోజు స్క్రీన్లు తక్కువ పడితే అంతకంటే పండగేమనుకుంటాం. కానీ వాటిలో ఒక్క దానికి మినహాయించి మిగిలినవాటికి హౌస్ ఫుల్స్ కావడం పక్కనపెడితే అసలు మధ్యాన్నం, రాత్రి ఆటలు క్యాన్సిల్ కావడమంటే ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమే. నిన్న విడుదలైన వాటిలో ఒక్క మ్యాడ్ మాత్రమే ప్రేక్షకులతో పాస్ ముద్ర వేయించుకుని వసూళ్లు రాబడుతోంది.

భాషతో సంబంధం లేకుండా మిగిలినవాటి బాక్సాఫీస్ సీన్ దయనీయంగా ఉంది. కలర్స్ స్వాతి మంత్ అఫ్ మధు, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, మురళీధరన్ 800, సిద్దార్థ్ చిన్నాలకు నగరాల్లో కొన్ని మల్టీప్లెక్సులు మినహాయించి చాలా చోట్ల షోకు కనీసం ఓ పాతిక మంది రాలేని పరిస్థితి నెలకొంది. పలు బిసి సెంటర్లలో మార్నింగ్ షోలే రద్దు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల ఆల్రెడీ తీసేసిన జవాన్ ని మళ్ళీ వేసి ఫైనల్ రన్ వైపు వెళ్తున్న స్కందని తిరిగి కంటిన్యూ చేస్తున్నారు. ఒక నెల మొదటి వారంలో ఇలా జరగడం అనూహ్యం.

దెబ్బకు బయ్యర్లు బెంబేలెత్తుతున్నారు. దసరాకు భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావులు వచ్చే దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదని, అద్దెలు గిట్టుబాటు అయితే చాలానే రీతిలో ఎగ్జిబిటర్లు రోజు దేవుడిని వేడుకోవడం మినహా ఏం చేయలేమంటున్నారు. హైదరాబాద్, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో కొంత మెరుగ్గా ఉన్నా మాస్ ప్రభావం ఎక్కువగా ఉండే కేంద్రాల్లో మాత్రం టికెట్ కౌంటర్లు డల్లుగా ఉన్నాయి. ఇతర బాషల మిషన్ రాణిగంజ్, దోనో, ఎగ్జార్సిస్ట్ బిలీవర్ లు కూడా అంతంతమాత్రమే జనాన్ని రప్పిస్తున్నాయి. సో మ్యాడ్ తప్ప ఈ ఫ్రైడే టోటల్ బ్యాడ్ అయిపోయింది. 

This post was last modified on October 7, 2023 4:25 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

39 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago