మన సినిమాని పక్క భాష వాళ్ళు ఆదరిస్తున్నారంటే వాళ్లకు గౌరవం ఇవ్వడం ఎంతైనా అవసరం. కానీ కోలీవుడ్ హీరోలు నిర్మాతలకు అదేమి పట్టడం లేదు. కనీసం టైటిల్ ని తెలుగులో అనువదించాలన్న సోయ లేకుండా ప్యాన్ ఇండియాని సాకుగా చూపించి యధాతథంగా పెట్టేస్తున్నారు. శివ కార్తికేయన్ కొత్త సినిమా అయలాన్ కు అదే పేరుని అలాగే ఉంచేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందు అజిత్ వలిమై, కంగనా రౌనత్ తలైవి, త్వరలో విడుదల కాబోయే విజయ ఆంటోనీ రత్తం అందరిదీ ఇదే దారి. అరవ భాషని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ విషయంలోనే కాదు మరికొన్ని అంశాల్లోనూ తమిళ హీరోల ధోరణి ఆమోదయోగ్యంగా లేదు. ఇక్కడ మార్కెట్ ఎంత పెరుగుతున్నా విజయ్ ఏనాడూ హైదరాబాద్ కు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన పాపాన పోలేదు. దిల్ రాజు లాంటి దిగ్గజమే వారసుడు టైంలో ఇది సాధించలేకపోయారు. కారణాలు చెప్పుకున్నారు అవి సహేతుకంగా అనిపించలేదు. అజిత్ సంగతి సరేసరి. భాగ్యనగరానికి షూటింగ్ కోసం ఎన్ని సార్లు వచ్చినా కనీసం డబ్బింగ్ హక్కులు కొన్న నిర్మాతతో మీటింగ్ కూడా పెట్టుకోరు. ఏమైనా అంటే మేమింతే మా పద్దతి ఇంతే సర్దుకోండని తేల్చేస్తారు.
హీరోలే కాదు నయనతార లాంటి హీరోయిన్లు సైతం టాలీవుడ్ ప్రెస్ మీట్లు, ఈవెంట్లంటే మొహం చాటేస్తారు. విశాల్, లారెన్స్, విజయ్ ఆంటోనీ, సూర్య, కార్తీ లాంటి వాళ్ళను వీటి నుంచి మినహాయించవచ్చు. వీళ్ళు దగ్గరుండి మరీ ప్రమోషన్లకు తమ వంతుగా సహకారం అందిస్తారు. ఒకప్పుడు దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ తీస్తే దాన్ని తెలుగులో భారతీయుడుగా డబ్ చేశారు. అది లాంగ్వేజ్ కిచ్చే గౌరవం. ఇప్పుడు చూస్తే ఆయనే గేమ్ చేంజర్ అంటూ ఇంగ్లీష్ కి షిఫ్ట్ అయిపోయారు. మనం ఎన్ని అనుకున్నా ఈ పోకడలో మార్పు రాదు కానీ చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేం.
This post was last modified on October 7, 2023 2:30 pm
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…