సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్లో ఒక విలక్షణమైన హీరో. చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఈ వారసత్వ హీరో.. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. కెరీర్ ఆరంభంలో చాలా వరకు ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకడిగా, ప్రత్యేక పాత్రలతోనే నెట్టుకొచ్చాడీ హీరో.
సొంతంగా ఫాలోయింగ్, మార్కెట్ రావడానికి చాలానే సమయం పట్టింది. ఆ తర్వాత ‘రేస్’, ‘లవ్ ఆజ్ కల్’ లాంటి సినిమాలతో స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూనే.. మల్టీస్టారర్లలో నటిస్తూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. గత దశాబ్ద కాలంలో సైఫ్ అనేకానేక ప్రయోగాలు చేశాడు. ‘సేక్ర్‌డ్ గేమ్స్’ లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ మెరిశాడు. సినీ జీవితంలో మాదిరే అతడి వ్యక్తిగత జీవితంలోనూ అనేక మలుపులున్నాయి. తొలి భార్య నుంచి విడాకులు తీసుకుని కరీనా కపూర్‌ను పెళ్లాడటం అందులో ఓ ముఖ్యమైన మలుపు.
ఈ మలుపులన్నింటికీ అక్షర రూపం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఈ సీనియర్ హీరో. తన ఆత్మకథను రాయబోతున్నట్లు సైఫ్ ప్రకటించడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. తన సినిమా, వ్యక్తిగత జీవితంలో ఎత్తు పల్లాలు, వివిధ అనుభవాలకు అక్షర రూపం కల్పిస్తూ తన జీవిత కథను రాయాలని నిర్ణయించుకున్నట్లు సైఫ్ వెల్లడించాడు.
ఏడాదికి పైగా ఇందుకోసం సమయం కేటాయించనున్నానని.. స్వయంగా తనే ఈ పుస్తకం రాయనున్నానని.. వచ్చే ఏడాది చివర్లో ఇది పూర్తవుతుందని అతను వెల్లడించాడు. బాలీవుడ్లో చాలామంది సీనియర్ హీరోలున్నారు కానీ.. వాళ్లెవ్వరికీ ఇలాంటి ఆలోచన కలగలేదు. తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఆత్మకథను రాస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో చాలా సీరియస్‌గా ఆ పనిలో నిమగ్నమయ్యారు మెగాస్టార్. ఇక్కడ చిరు, అక్కడ సైఫ్ ఆత్మకథలు ఒకేసారి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 25, 2020 2:18 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…