Movie News

ప్రభాస్ ఇలా కనిపిస్తే అరాచకమే

బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు కానీ మిర్చి, ఈశ్వర్ రేంజ్ లో ఒక ఊర మాస్ కంటెంట్ పడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ తక్కువైనా పర్లేదు కానీ నిఖార్సైన తెలుగు కమర్షియల్ బొమ్మలో చూడాలని వాళ్ళ కోరిక. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అలాగే కనిపిస్తాడనే టాక్ ఉంది కానీ గెటప్ ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. ఈలోగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత ఉపయోగించి లీకుల ఆధారంగా కొందరు ఫ్యాన్స్ డార్లింగ్ ఎలా ఉంటాడనే దాని మీద ఒక ఆర్ట్ డిజైన్ చేశారు.

నిజంగానే అదిరిపోయిందనిపించేలా ప్రభాస్ కటవుట్ అరాచకంగా ఉంది. ఊహించి చేసిందే కానీ ఒకవేళ అచ్చం ఇదే మేకోవర్ తో కనక ఓ ఫ్యాక్షన్ సినిమా తీస్తే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమే. ఇదొక్కటే కాదు మహేష్ బాబు రాజమౌళి ఫారెస్ట్ మూవీకి సంబంధించి కూడా కొన్ని ఇమేజెస్ తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సలార్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఉన్నా అధిక శాతం అది కెజిఎఫ్ లాగా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటుంది. సో నేటివిటీ పరంగా మన మాస్ కు కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ మారుతీది మాత్రం అలా ఉండదని ఇన్ సైడ్ టాక్.

డిసెంబర్ లో సలార్ 1 రిలీజయ్యాక రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. ఆలోగా కల్కి ఫస్ట్ పార్ట్ ని ఒక కొలిక్కి తీసుకొస్తారు. జనవరి నుంచి మారుతీ షూటింగ్ మళ్ళీ వేగమందుకుంటుంది. సందీప్ వంగా స్పిరిట్ ని వేసవి లోగానే మొదలుపెట్టొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న మరో ప్యాన్ ఇండియాకు సంబంధించిన స్క్రిప్ట్ ఫైనలైతే అది కూడా సెట్స్ పైకి వెళ్తుంది. రాబోయే మూడేళ్ళకు సరిపడా రిలీజులు ప్రభాస్ రెడీ చేసి పెడుతున్నాడు. కాకపోతే తన చేతుల్లో లేని వాయిదాల పర్వం వల్ల ఫ్యాన్స్ ఫీలవుతున్నారు తప్పించి వేగంగా భారీ చిత్రాలు చేయడంలో ప్రభాసే ముందున్న మాట వాస్తవం. 

This post was last modified on October 5, 2023 5:11 pm

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

28 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

56 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago