Movie News

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

ఇప్పటిదాకా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ అంటే గుర్తొచ్చేది బ్రహ్మోత్సవం ఒకటే. ఫ్యామిలీ డ్రామాగా భారీ అంచనాలు మోసుకొచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వైనం మహేష్ అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. దీని దెబ్బకే అడ్డాల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తిరిగి నారప్ప రీమేక్ కోసం సురేష్ బాబు పిలిచే దాకా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఈలోగా పెదకాపు కథ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డికి నచ్చడం, విరాట్ కర్ణని పరిచయం చేయడానికి ఇదే బెస్ట్ సబ్జెక్టని ఫీల్ కావడంతో పెద్ద బడ్జెట్ తో మూడు భాగాలుగా ప్లాన్ చేసుకున్నారు.

కట్ చేస్తే థియేట్రికల్ బిజినెస్ పరంగా పెదకాపు 1 బ్రహ్మోత్సవంని మించిన ఫలితాన్ని అందుకుంది. 12 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి కనీసం పది శాతం కూడా రికవరీ చేయలేక ఈ ఏడాది అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా మిగిలిపోనుంది. మొదటి రోజు సాయంత్రం నుంచే డెఫిషిట్లు మొదలు కావడం ట్రాజెడీ. ట్రేడ్ చెబుతున్న దాని ప్రకారం పట్టుమని నలభై లక్షలు కూడా వసూలు చేయలేక పెదకాపు వారం తిరగకుండానే తిరుగుటపా కట్టేస్తోంది. భారీ మొత్తాలకు కొన్న బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పలేదు. ఎల్లుండి ఎనిమిదికి పైగా కొత్త రిలీజులు ఉన్న నేపథ్యంలో ఇక ఆశలేం లేవు.

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక ఏ నిర్మాతైనా అంత సాహసం చేయడు. తనకు అలవాటు లేని కొత్త జానర్ ని ట్రై చేసిన శ్రీకాంత్ అడ్డాలకు ఈ షాక్ మళ్ళీ ఎంత గ్యాప్ ఇస్తుందో చెప్పలేం. ఒక పెద్ద హీరోతో అన్నాయ్ అనే రెండు భాగాల చిత్రాన్ని ప్లాన్ చేసుకున్న ఈ ఫ్యామిలీ దర్శకుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమే. విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన అడ్డాల తీరా సినిమా వచ్చాక ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, బయట కనిపించడం కానీ చేయలేదు. కంటెంట్ పరంగా చాలా దారుణంగా ఉన్న చంద్రముఖి 2నే మెరుగైన కలెక్షన్లు రాబట్టడం అసలు విషాదం. 

This post was last modified on October 4, 2023 11:47 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రియాక్షన్లు గమనిస్తున్నారా పూరి గారూ

నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…

3 mins ago

కల్కి పబ్లిసిటీకి పక్కా ప్రణాళికలు

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…

2 hours ago

దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…

3 hours ago

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం…

8 hours ago

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల…

14 hours ago

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…

15 hours ago