Movie News

అందుకే సుకుమార్.. ది బెస్ట్

టాలీవుడ్లో నంబర్ వన్ దర్శకుడెవరు అంటే తడుముకోకుండా రాజమౌళి పేరు చెప్పేస్తారు. టాలీవుడ్ అనేంటి.. బాక్సాఫీస్ సక్సెస్‌ను ప్రామాణికంగా తీసుకుంటే ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడు రాజమౌళి.

కానీ రచనా సామర్థ్యం, కొత్తదనం, ఒరిజినాలిటీ లాంటి ప్రమాణాల్ని తీసుకుంటే.. రాజమౌళే టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడా అనే విషయంలో కచ్చితంగా సందేహాలు కలుగుతాయి. మరి ఈ ప్రమాణాలు తీసుకుంటే టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడు ఎవరు?

ఇప్పుడీ చర్చ రావడానికి కారణం.. ఆస్కార్ అవార్డు గెలిచిన కొరియన్ మూవీ ‘పారసైట్’ను రాజమౌళి విమర్శించడం. ఈ సినిమా బోరింగ్, చూస్తూ చూస్తూ మధ్యలో నిద్ర పోయా అని రాజమౌళి కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన సినిమాల మీద విశ్లేషణ మొదలుపెట్టారు నెటిజన్లు. జక్కన్న కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన మగధీర, ఈగ, బాహుబలి సినిమాల్ని పరిశీలిస్తే వాటిలో హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి కనిపిస్తుంది.

సన్నివేశాలకు సన్నివేశాలు కొన్ని చోట్ల నుంచి లేపుకొచ్చేశాడన్న విమర్శలు రాజమౌళిపై ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో రాజమౌళి హాలీవుడ్ చిత్రాల నుంచి ఎలా స్ఫూర్తి పొందాడన్నది యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే రాజమౌళి ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నా సరే.. ఓ వర్గం ప్రేక్షకుల్లో మాత్రం ఆయన గౌరవం సంపాదించుకోలేకపోయారు. ఆయన్ని ఒరిజినాలిటీ లేని దర్శకుడిగా విమర్శిస్తారు.

కాపీ మాస్టర్ త్రివిక్రమ్

Trivikram

ఇక టాలీవుడ్లో నంబర్ వన్ స్థానానికి పోటీలో ఉన్న మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలోనూ విమర్శలు తక్కువేం కాదు. అభిమానులు ‘గురూజీ’ అని చాలా గౌరవంగా ఆయన్ని పిలుచుకుంటారు కానీ.. ఆ మాటకు తగ్గ స్థాయి త్రివిక్రమ్‌కు లేదంటారు ఆయన విమర్శకులు. ఒరిజినాలిటీ విషయానికి వస్తే రాజమౌళే త్రివిక్రమ్‌ కంటే ఎంతో నయం అంటారు.

అపారమైన విషయ పరిజ్ఞానం, పుస్తక జ్ఞానం ఉన్నట్లు కనిపించే త్రివిక్రమ్.. మాటల చాతుర్యంతో మాయ చేస్తాడు కానీ.. ఆయన సినిమాల్లో కూడా ఒరిజినాలిటీ కనిపించదు. ఈ మధ్యే ‘ఖలేజా’లోని ఓ ముఖ్య సన్నివేశాన్ని ఓ హాలీవుడ్ మూవీ నుంచి మక్కీకి మక్కీ ఎలా దించేశాడో ఓ వీడియోలో చూశాం. ఇలాంటి ‘స్ఫూర్తి’ త్రివిక్రమ్ ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంటుంది. ‘మీనా’ సినిమాను కాపీ కొట్టి ‘అఆ’.. ‘లార్గోవించ్’ను దించేస్తూ ‘అజ్ఞాతవాసి’ సినిమాలు తీశాడు. ‘నువ్వే నువ్వే’, ‘అతడు’; ‘జులాయి’ లాంటి సినిమాల్లోనూ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. అందుకే త్రివిక్రమ్‌ అనుకున్న స్థాయిలో గౌరవం సంపాదించుకోలేకపోయాడు.

దటీజ్ సుక్కు

Sukumar

ఒరిజినాలిటీ అనే విషయానికి వస్తే మాత్రం టాలీవుడ్లో కచ్చితంగా సుకుమార్ నంబర్ వన్ దర్శకుడని ఒప్పుకోవాల్సిందే. యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో సుక్కుపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కొంత ఉన్నట్లు కనిపిస్తుంది కానీ.. కథాకథనాలు, నరేషన్ విషయంలో మాత్రం ఆయన ‘ఒరిజినల్’ డైరెక్టర్ అని ఒప్పుకోవాల్సిందే. సుక్కు ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఒక జానర్‌కు పరిమితం కాడు. విభిన్నమైన కథలు ప్రయత్నిస్తాడు. కొత్తగా నరేట్ చేస్తాడు. ప్రతి సన్నివేశంలోనూ తన ముద్ర చూపిస్తాడు.

సుక్కుకు ఈ విషయంలో పోటీ ఇచ్చే దర్శకుడు కొరటాల శివ మాత్రమే. ఆయన సైతం తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తాడు కానీ.. ఆయన సినిమాలు మరీ కొత్తగానూ, పాతగానూ కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. సక్సెస్ రేట్ విషయంలో కొరటాల సుక్కు కంటే ముందున్నా సరే.. ఒరిజినాలిటీ, వైవిధ్యం ప్రమాణాలుగా తీసుకుంటే మాత్రం సుక్కునే టాలీవుడ్ ‘నంబర్ వన్’ డైరెక్టర్ అని ఒప్పుకోవాల్సిందే.

This post was last modified on April 25, 2020 3:54 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

4 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

6 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

6 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

7 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

9 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

9 hours ago