సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తు. ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ మీడియాతో టచ్ లో ఉండటం వల్ల ఫలానా మూవీ వస్తోందనే విషయం ఆడియన్స్ మెదడులో క్రమం తప్పకుండా ఉంటుంది. దీనికి చిన్నా పెద్దా తేడా లేదు. అందరూ ఒకటే. వంద కోట్లతో తీసి కేవలం పబ్లిసిటీ సరిగా చేయని కారణంగా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాలు ఈ ఏడాదిలోనే ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని అందుకే ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. నిర్మాతలు కూడా దానికి అనుగుణంగా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటారు.
హాయ్ నాన్న మార్చుకోవాల్సిన విడుదల తేదీ ఇంకా ఖరారు చేసుకోనప్పటికీ ప్రచారం మాత్రం కొనసాగిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన మొదటి లిరికల్ వీడియో సమయమాకి మంచి స్పందన రాగా తాజాగా తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే గాజుబొమ్మ పాటను వదిలేముందు చిన్న ప్రమోషన్ వీడియోని ఆకట్టుకునేలా డిజైన్ చేయించారు. విజయ్ దేవరకొండ ఖుషితో హిట్ డెబ్యూ అందుకున్న హేశం అబ్దుల్ వహబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. నాని ప్రత్యేకంగా ప్రోమోల కోసమే షూటింగులు చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ప్రకటన స్టేజి నుంచే దీన్ని ఫాలో అవుతున్నారు.
సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న హాయ్ నాన్న ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజువల్స్ గట్రా చూస్తుంటే అనుభవం ఉన్న రీతిలో హ్యాండిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో రావాలా లేక ఫిబ్రవరికి షిఫ్ట్ అవ్వాలా అనే విషయంలో నాని టీమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము లాక్ చేసుకున్న డేట్ కి సలార్ చొచ్చుకు వచ్చేయడంతో హాయ్ నాన్నకు పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేకపోయింది. ఇంకో వారం లోపు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏమైనా నాన్న ప్లానింగ్ మాత్రం బాగుంది.
This post was last modified on October 3, 2023 1:17 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…