సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సలార్, డుంకీల క్లాష్ గురించే చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ వార్ సంగతి తెలిసిందే. ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ మేమంటే మేమంటూ అభిమానులు తమ హీరోల సినిమాల గొప్పదనం గురించి పోస్టులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. మరోవైపు డుంకీ వాయిదా పడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు కొన్ని నొక్కి చెబుతున్నప్పటికీ షారుఖ్ ఖాన్ టీమ్ మాత్రం అబ్బే అదేమీ లేదంటోంది. ఖచ్చితంగా చెప్పిన డేట్ కి వచ్చి తీరతామని పిఆర్ ద్వారా మీడియా ఫీలర్లు వదులుతూనే ఉంది.
ఈ గోల కాసేపు పక్కనపెడితే బుక్ మై షో వేదికగా నమోదవువుతున్న ఇంటరెస్ట్ వ్యవహారం చూస్తే షాక్ కలగక మానదు. సలార్ కు ఇప్పటిదాకా 3 లక్షల 62 వేల 800 మంది తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా స్పందిస్తే డుంకీకి మాత్రం కేవలం 76 వేల 700 నమోదయ్యాయి. అంటే ప్రభాస్ దక్కించుకున్న దాంట్లో కనీసం సగం కూడా షారుఖ్ చేరుకోలేదనేది స్పష్టం. తర్వాతి స్థానాల్లో అనిమల్ 39 వేల 800, కెప్టెన్ మిల్లర్ 15 వేల 200తో ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సలార్ హైప్, క్రేజ్ ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయనేది సుస్పష్టం.
ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ నెంబర్లలో గణనీయమైన మార్పు ఉంటుంది. అయినా సరే షారుఖ్ ఖాన్ మన ప్రభాస్ ని దాటడం అసాధ్యం. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని కొత్త టీజర్ ని సిద్ధం చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దీంతో ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తాడని దానికి పని చేసిన వాళ్ళు చెబుతున్నారు. డుంకీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీని తక్కువంచనా వేయకపోయినా మాస్ వర్గాల్లో ప్రశాంత్ నీల్ డామినేషన్ చాలా స్పష్టంగా ఉంది. థియేటర్ల కేటాయింపులోనూ సలార్ దే పైచేయి అవుతుందని నార్త్ బయ్యర్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 3, 2023 11:26 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…