Movie News

కుర్రకారు హుషారులో ‘మ్యాడ్’ కాలేజీ

ఈ శుక్రవారం మీడియం రేంజ్ సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా యువతని టార్గెట్ చేసుకున్న చిత్రం మ్యాడ్. సితార బ్యానర్ నాగవంశీ సోదరి హారికతో పాటు సాయి సౌజన్య నిర్మాతలుగా పరిచయమవుతున్న ఈ యూత్ ఫుల్ డ్రామా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నవీన్ నార్నే హీరోగా పరిచయమవుతున్నాడు. మొదలుపెట్టిన డెబ్యూ ఇది కాకపోయినా రిలీజ్ అవుతున్న క్రమంలో ఫస్ట్ మ్యాడే కాబట్టి ఇదే లాంచింగ్ కిందకు వస్తుంది. ఇవాళ తారక్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. కంటెంట్ దేని గురించో స్పష్టంగా చెప్పేశారు.

అదో పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ. అల్లరి తప్ప చదువనే ప్రపంచమే తెలియని ముగ్గురు కుర్రాళ్ళు(నార్నె నితిన్ – సంగీత్ శోభన్- రామ్ నితిన్) అక్కడ చేరతారు. ఏసికి కూలర్ కి తేడా తెలియని అమాయకత్వంతో పాటు ప్రిన్సిపల్(రఘుబాబు)ఫోటోని గోడ మీద అతికించి కామెడీ చేసే చిలిపితనం కూడా ఉంటుంది. ఇలా సరదాగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్ లో క్యాంటీన్ కు సంబంధించిన సమస్య ఒకటి అడుగు పెడుతుంది. అసలు ఏ లక్ష్యం లేకుండా సాగిపోతున్న ఈ కుర్ర బ్యాచ్ చివరికి సాధించింది ఏమిటి, ఎంజాయ్ మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లైఫ్ లో ఇంకేమున్నాయో మ్యాడ్ లో చూడాలి.

మొత్తం యూత్ ఫుల్ జోకులుతో ట్రైలర్ నింపేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ చాలా క్లియర్ గా కుర్రకారుని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని దానికి అనుగుణంగానే సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. టీజర్ లో జోకులు కొన్ని కామెంట్స్ కి దారివ్వడంతో ఈసారి అవి లేకుండా జాగ్రత్త పడ్డారు. క్యాస్టింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. జాతిరత్నాలు టైపులో సింపుల్ జోకులతోనే పెద్దగా నవ్వించే ప్రయత్నం జరిగింది. భీమ్స్ సంగీతం సమకూర్చిన మ్యాడ్ రెండు రోజుల ముందే ప్రీమియర్లకు రెడీ అవుతోంది. వినోదానికి లోటు లేకుండా ఉన్న ఈ సినిమా ట్రైలర్ కు తగ్గట్టే ఉంటే హిట్టు పడ్డట్టే.

This post was last modified on October 3, 2023 11:22 am

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

1 hour ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

7 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

8 hours ago