ఒక పార్టీకి అనుకూలంగా.. మరో పార్టీకి వ్యతిరేకంగా సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఒక రాజకీయ అంశాలతో ముడిపడ్డ సినిమాలు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. గత వారాంతంలో రిలీజైన ‘స్కంద’ సినిమాలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ బోలెడన్ని డైలాగులు పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను.
అతను టీడీపీ మద్దతుదారన్న విషయం ఓపెన్ సీక్రెటే. అవకాశం ఉన్న చోటల్లా.. కొన్ని పొలిటికల్ డైలాగులను ఇరికించి మరీ జగన్ సర్కారు మీద పంచ్‌లు వేశాడు బోయపాటి. ఈ సినిమాను తెలుగుదేశం మద్దతుదారులు బాగానే ఓన్ చేసుకున్నారు. ఐతే దీంతో పాటే రిలీజైన ఇంకో సినిమా టీడీపీకి మంచి ఎలివేషన్ ఇచ్చినా కూడా దాన్ని అస్సలు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చిత్రమే.. పెదకాపు.
‘స్కంద’లో పనిగట్టుకుని జగన్ సర్కారు మీద పంచ్‌లు వేస్తే అవి టీడీపీ వాళ్లకు మంచి కిక్ ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాను వాళ్లు బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ‘పెదకాపు’లో ప్రాపగండాలా కాకుండా నిజాయితీగా శ్రీకాంత్ అడ్డాల తెలుగుదేశం పార్టీకి మంచి ఎలివేషన్ ఇచ్చాడు. పెద్ద పెద్ద వాళ్ల చేతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సామాన్య జనాల బాధలను పట్టించుకోని సమయంలో.. తెలుగుదేశం పార్టీ వచ్చి విప్లవం సృష్టించిన తీరును.. అతి సామాన్యులకు టికెట్లు ఇవ్వడమే కాక అప్పటిదాకా ఏ పార్టీ చేయని రీతిలో సామాజిక న్యాయం పాటించిన విషయాన్ని ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల చూపించాడు.
ఏదో ఒక స్టాండ్ తీసుకున్నట్లు.. పనిగట్టుకుని ఎలివేషన్ ఇచ్చినట్లు కాకుండా నిజాయితీగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి పరిస్థితులను అతను తెర మీదికి తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఓవరాల్‌గా సినిమా అంత ఆకట్టుకోకపోయినా.. తెలుగుదేశం పార్టీకి మాత్రం మంచి ఎలివేషన్ లభించింది ఈ సినిమాలో. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి చిత్రాన్ని తెలుగుదేశం వాళ్లు అస్సలు ఓన్ చేసుకోకపోవడం.. దాన్ని ప్రమోట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on October 3, 2023 6:06 am
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన…
నవీన్ పొలిశెట్టిని స్క్రీన్ మీద చూసి ఏడాది దాటిపోయింది. తన చివరి చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ గత…
అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను…
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు మంచు ఫ్యామిలీ గొడవ.. మరోవైపు సంధ్య…