Movie News

కొత్త సినిమాలది మామూలు కష్టం కాదు

బాక్సాఫీస్‌కు ఎప్పుడు ఊపొస్తుందో.. ఎప్పుడు అది డల్ అవుతుందో తెలియదు. కొన్నిసార్లు టైమింగ్ కలిసొచ్చి యావరేజ్‌గా ఆడాల్సిన సినిమాలు కూడా పెద్ద హిట్టయిపోతుంటాయి. కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోతుంటాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ కొంచెం స్లంప్‌లోనే నడుస్తోంది. కొన్ని వారాలుగా సరైన సినిమాలే లేవు. బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది.

గత వీకెండ్లో రిలీజైన కొత్త చిత్రాల్లో ‘స్కంద’ ఓ మోస్తరుగా ఆడుతోందంతే. చంద్రముఖి-2, పెదకాపు సినిమాలు వాషౌట్ అయిపోయాయి. ఇక వచ్చే వారాంతంలో లెక్కకు మిక్కిలి సినిమాలు రిలీజవుతున్నాయి. ఒక వీకెండ్లో రెండో మూడో సినిమాలు రిలీజైతే ప్రేక్షకుల దృష్టి వాటి మీద ఉంటుంది. కానీ ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలు రిలీజైతే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 

అసలే బాక్సాఫీస్ స్లంప్ నడుస్తున్న టైం. ఇలాంటపుడు పరిమితికి మించి సినిమాలు రిలీజైతే వాటిలో కొన్ని ప్రేక్షకుల దృష్టిలోనే పడకుండా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వారం రాబోయే చిత్రాలు అలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటున్నాయి. ఉన్నంతలో ‘రూల్స్ రంజన్’ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. దాని ట్రైలర్ చూస్తే మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. సినిమాకు కొంచెం బజ్ ఏర్పడింది. ‘మ్యాడ్’ కూడా యూత్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా మీద టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. మిగతా సినిమాలకు మాత్రం ఆశించిన బజ్ కనిపించడం లేదు.

‘మామా మశ్చీంద్ర’కు ఎందుకో సరైన బజ్ క్రియేట్ కాలేదు. దీని ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఇక ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ చాలా బాగున్నా స్టార్ కాస్ట్ లేకపోవడం, సినిమా మరీ క్లాస్‌గా కనిపిస్తుండటం మైనస్ అయ్యేలా ఉంది. ఇంత పోటీలో ఇలాంటి సినిమాను జనం ఏమేర పట్టించుకుంటారన్నది సందేహం. తెలుగు సినిమాలకే స్కోప్ తక్కువగా ఉంటే ‘800’, ‘చిన్నా’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి. వాటికి చాలినన్ని థియేటర్లు దొరకడం, ప్రేక్షకుల దృష్టిలో పడటం చాలా కష్టమే. ఇవి కాక నేనే సరోజ, రాక్షస కావ్యం అని చిన్నా చితకా చిత్రాలేవో వస్తున్నాయి.మరి ఇంత పోటీలో ప్రేక్షకుల మెప్పు పొందే సినిమాలేవో చూడాలి.

This post was last modified on October 2, 2023 6:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago