Movie News

డుంకీ దర్శకుడి మీద రీమేక్ మరకలు

ఒకే రోజు తలపడనున్న డుంకీ, సలార్ ల గురించి మేమంటే మేము గొప్పని సోషల్ మీడియా ఫ్యాన్స్ తెగ చించేసుకుంటున్నారు. నిన్న సలార్ కన్నడ మూవీ ఉగ్రం రీమేకనే ప్రచారాన్ని తెగ తిప్పేశారు. అది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కావడమే దీనికి కారణం. గతంలో  ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందు సంగీత దర్శకుడు రవి బస్రూర్ అన్న మాటలను వైరల్ చేస్తూ ఫ్యాన్ వార్ ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా. రాజ్ కుమార్ హిరానీని టార్గెట్ చేస్తూ ఆయన గత, ప్రస్తుత చిత్రాలు దేనికి రీమేకో ఆధారాలు బయటికి తీస్తున్నారు

డుంకీ హాలీవుడ్ మూవీ సిఐఏ ఆధారంగా తీస్తున్నారని, అదొక్కటే కాకుండా డాంకీ ఫ్లైట్, దుల్కర్ సల్మాన్ కామ్రేడ్ ఇన్ అమెరికాల నుంచి స్ఫూర్తి పొందారని పోస్ట్లు పెడుతున్నారు. అసలు సినిమానే చూడకుండా ఎలా అంటున్నారంటే వలసదారుల కష్టాలను ఆధారంగా చేసుకుని హిరానీ డుంకీ తీస్తున్నారనే లీక్ ముంబై వర్గాల్లో గతంలోనే వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడీ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు పీకే, 3 ఇడియట్లో పలు సన్నివేశాలను ఉటంకిస్తూ అవి ఏ ఇంగ్లీష్ సినిమాల నుంచి తీసుకొచ్చారో వీడియోలు, పోస్టర్లతో సహా ట్వీట్ చేస్తూ తగిన కౌంటర్లు ఇస్తున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో అవసరం లేని విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. డుంకీ, సలార్ పోటీ అనివార్యమని తేలిపోయాక పరస్పరం రెండు బాగా ఆడాలని కోరుకోవడం తప్ప ఎవరైనా ఏమి చేయలేరు. అది వదిలిపెట్టి దర్శకుల రీమేక్ వ్యవహారాలను రచ్చకీడ్చడం వల్ల ఎలాంటి లాభం లేదు. పైగా రిలీజయ్యాక వాటిలో వేరే కథలంటే ట్రోల్ చేస్తున్న వాళ్లే కామెడీ అయిపోతారు. ఇవి ఎన్ని జరుగుతున్నా హిరానీ, నీల్ ఇద్దరూ తమ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరైనా ఆన్ లైన్లో ఈ రచ్చ జరుగుతోందని చెప్పినా  వినే పరిస్థితిలో ఎంత మాత్రం లేరన్నది వాస్తవం.

This post was last modified on October 2, 2023 11:43 am

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

1 hour ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

7 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

8 hours ago