కెరీర్ మొదలుపెట్టింది ఫ్లాప్ సినిమాలతోనే అయినా ఒక్కసారిగా మీనాక్షి చౌదరి కెరీర్ ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఏ ముహూర్తంలో పూజా హెగ్డే గుంటూరు కారం నుంచి తప్పుకుందో కానీ అప్పటి నుంచి ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. వరసగా క్రేజీ ఆఫర్లు ముంచెత్తున్నాయి. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ ల సరసన జోడి కడుతుండగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 68లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎంపిక చేసినట్టు చెన్నై టాక్. మరో భామగా ప్రియాంకా అరుళ్ మోహన్ ఉండొచ్చట. ఒకరకంగా ఇది తనకు బ్రహ్మాండమైన జాక్ పాట్ అనే చెప్పాలి.
కొన్ని వారాల క్రితమే కొలై(తెలుగులో హత్య) అనే తమిళ మూవీ చేసిన మీనాక్షి చౌదరి అందులో హత్యకు గురయ్యే ఒక మాములు పాత్ర పోషించింది. విజయ్ ఆంటోనీ హీరో అయినప్పటికీ దారుణంగా డిజాస్టరయ్యింది. దెబ్బకు ఇంక అక్కడ ఆఫర్లు రావనుకుంటున్న టైంలో తలపతి సరసన ఛాన్స్ అంటే దశ తిరిగినట్టే. అధికారికంగా ప్రకటించలేదు. ఇక్కడ మహేష్ బాబు అక్కడ విజయ్ అంటే మాములు విషయం కాదు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ రెండు పాత్రలు చేస్తున్నాడు. తండ్రి కొడుకని సమాచారం. అయితే ఈ డ్యూయల్ రోల్స్ రెగ్యులర్ గా ఉండవని యూనిట్ లీక్.
మొత్తానికి హీరోయిన్ల కొరత మీనాక్షి చౌదరి లాంటి వాళ్లకు వరంగా మారుతోంది. ఇట్లు వాహనములు నిలుపరాదు. ఖిలాడీ రెండూ బాక్సాఫీస్ వద్ద నిలువునా మునిగినా అడవి శేష్ హిట్ 2లో పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా మీనాక్షి చౌదరి ఇంత వేగంగా స్పీడ్ అందుకోవడం విశేషమే . శ్రీలీల తప్ప ఇంకో ఆప్షన్ కనపడకుండా పోతున్న దర్శకులకు ప్రత్యాన్మయంగా కనిపిస్తోంది. విజయ్ ఇప్పుడీ సినిమా చేశాక రాజకీయాలోకి వెళ్ళిపోతాడనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ 68వ సినిమాని చాలా స్పెషల్ గా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలిసింది.
This post was last modified on October 1, 2023 10:12 pm
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…