నిన్న విడుదలైన పెదకాపు 1 వసూళ్లు ట్రేడ్ కి పెద్ద షాక్ ఇచ్చాయి. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ చూసిన ఆడియన్స్ అంతో ఇంతో మొదటి రోజు వస్తారనే ధీమా టీమ్ లో కనిపించింది. కానీ ఓపెనింగ్ గ్రాస్ కనీసం పాతిక లక్షలైనా రాకపోవడం ఆందోళన కలిగించే విషయమే. పైగా పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో వీకెండ్ మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవడానికి లేకుండా పోయింది. స్కందకు సైతం బ్యాడ్ టాక్ ఉన్నప్పటికీ మాస్ కంటెంట్ తో పాటు రామ్ బ్రాండ్ జనాన్ని థియేటర్ల దాకా తీసుకొస్తోంది. అదే ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది.
కానీ పెదకాపు 1 విషయంలో రివర్స్ కావడం ఎవరూ ఊహించనిది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసినా లాభం లేకపోయింది. ప్రివ్యూలు చూసిన వాళ్ళు చాలా బాగుందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా దాని ప్రయోజనం టికెట్ కౌంటర్ల దగ్గర కనిపించలేదు. శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా సీరియస్ జానర్ కి షిఫ్ట్ అయిపోవాలనే ఆలోచన మంచిదే కానీ కొత్త హీరోతో ఇంత పెద్ద కాన్వాస్ మీద స్లో నెరేషన్ తో మెప్పించాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టింది. చాలా చోట్ల పట్టుమని పాతిక మంది కూడా రాలేని షోలు ఫస్ట్ డేనే నమోదయ్యాయని డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడ్డారు.
సుమారు పన్నెండు కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్న పెదకాపు 1 ఫైనల్ గా భారీ నష్టాలు తప్పేలా లేవు. దీని ప్రభావం తర్వాత ప్లాన్ చేసుకున్న సీక్వెల్స్ మీద ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొత్తం మూడు భాగాలు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి వాటికి ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే తర్వాత వాటికి బజ్, బిజినెస్ రెండూ వస్తాయి. కానీ పెదకాపుకి అలా జరిగే ఛాన్స్ లేకపోవడంతో నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ముఖ్యంగా విపరీతమైన డెప్త్ ఉన్న కథని కొత్త హీరో మీద చేయడం పెద్ద రిస్క్ అయిపోయింది. స్టార్ హీరో అయ్యుంటే రిజల్ట్ కొంచెం బెటర్ గా ఉండేది.
This post was last modified on September 30, 2023 5:14 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…