శంకర్ ఏళ్ళ తరబడి తీస్తూనే ఉన్న గేమ్ చేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో కానీ మరోవైపు రామ్ చరణ్ 16కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి. తగినంత సమయం దొరకడంతో దర్శకుడు బుచ్చిబాబు ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. పెద్ద ఆఫీస్ తో పాటు భారీ ఎత్తున సిబ్బందితో పక్కా ప్లానింగ్ జరుగుతోంది. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ క్యాస్టింగ్ కు సంబంధించిన ఎంపిక మాత్రం జరుగుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా హీరోయిన్ గా కొత్త మొహం కోసం చూస్తున్న టీమ్ కి ఓ స్టార్ హీరోయిన్ వారసురాలు పరిశీలనలో ఉందట.
ఆ అమ్మాయి పేరు రషా తదాని. సీనియర్ కథానాయికి రవీనాటాండన్ కూతురు. వెంటనే గుర్తుకు రావాలంటే కెజిఎఫ్ లో ప్రధాన మంత్రిగా నటించినావిడ అంటే ఠక్కున ఫ్లాషవుతుంది. నిన్నటి తరం వాళ్లకు మాత్రం బంగారు బుల్లోడులో బాలకృష్ణ జోడిగా, ఉపేంద్రలో పొగరుబోతు అమ్మడిగా గుర్తుండిపోయింది. ఈవిడ గారాల పట్టికే రషా తదాని. ఇటీవలే ఫోటో షూట్ జరిపిన ఆర్సి 16 బృందం అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగానే ఉందట. నటన ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి త్వరలో ఒక వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్టు తెలిసింది. అది జరిగాకే అధికారిక ప్రకటన రావొచ్చు.
ఇంతకీ రషా తదాని ఏ బాలీవుడే మూవీ చేసిందనుకుంటున్నారా. ఇంకా డెబ్యూ జరగలేదు. హిందీలో అజయ్ దేవగన్ ఫ్యామిలీకి చెందిన అమన్ దేవన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది వచ్చే ఏడాది విడుదల కావొచ్చు. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బుచ్చిబాబుకి రషాని రికమండ్ చేశారట. గురువు సుకుమార్ కి చూపిస్తే ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అఫీషియల్ నోట్ వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కానీ హీరోయిన్ల కొరత ఉన్న టాలీవుడ్ లో ఇలాంటి రషాల అవసరం స్టార్ హీరోలకు చాలా ఉంది. తీసుకోవడం మంచిదే.
This post was last modified on September 30, 2023 2:07 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…