దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. వరస బ్లాక్ బస్టర్లతో తన డిమాండ్ ని పీక్స్ కి చేర్చుకుంటున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు ఇండస్ట్రీ హిట్లు దక్కేలా చేయడంతో ఇతని పాత్ర చాలా కీలకం. అయితే తనతో పని చేయించుకునే విషయంలో దర్శకులు ఎలా ఉండాలనే దానికి అతనే కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. ఇటీవలే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.
అవేంటో చూద్దాం. జైలర్ స్క్రిప్ట్ రాసుకున్నాక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అడిగింది ఒక్క పాటే. అది కూడా ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేది. రికార్డింగ్ కూడా అదొక్కటే చేశారు. షూటింగ్ పూర్తయి రఫ్ కట్ చూశాక ఇంకో రెండు పాటలు పెట్టే ఛాన్స్ ఉందని అర్థమై టైగర్ కా హుకుం, తమన్నా కావాలయ్యా జోడించారు. హుకుం పదాన్ని సూపర్ స్టార్ చెప్పిన విధానం చూశాక దాని మీద ట్యూన్ కంపోజ్ చేసి ఓకే చేయించుకున్నాడు అనిరుధ్. ఇలా అదనంగా ఏవైతే మూడు సాంగ్స్ వచ్చి చేరాయో చివరికి అవే ఛార్ట్ బస్టర్స్ గా నిలవడం కొసమెరుపు.
ఇది నెల్సన్ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే జరిగిందని అనిరుద్ చెప్పుకొచ్చాడు. లోకేష్ కనగరాజ్ తాను ఏది ఇచ్చినా ఓకే చేస్తాడని, విక్రమ్ కు బ్యాక్ గ్రౌండ్ అయ్యాక ఫైనల్ కాపీ చూశాడని అప్పటిదాకా మధ్యలో పనిలా జరుగుతోందని కూడా అడగలేదట. అట్లీ తన ప్రపంచాన్ని వివరించి వదిలేస్తాడని అందుకే తనకు స్పెషల్ గా ఇస్తానని అన్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కుర్రాడికి ఎంత ఫ్రీడం ఇస్తే అది బెస్ట్ రాబట్టుకోవచ్చన్న మాట. ఇప్పుడిది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ 14లకు సంగీత దర్శకుడు తనే కాబట్టి ఈ టిప్స్ ఫాలో అయితే బెటరేమో
This post was last modified on September 30, 2023 11:16 am
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…