బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి భారీ చిత్రాలు రెండేసి భాగాలుగా రావడం మంచి ఫలితాన్నివ్వడంతో చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు కూడా సెకండ్ పార్ట్, సీక్వెల్స్ తీయడం మామూలైపోయింది. ఐతే సినిమా రిజల్ట్ ఏంటో చూడకుండా అందరూ సీక్వెల్స్ అనౌన్స్ చేస్తుండటంతో సమస్య తప్పట్లేదు. అసలు సినిమాలే సరిగా ఆడనపుడు.. ఇంక సీక్వెల్స్ ఏం పట్టాలెక్కుతాయి? గత ఏడాది రవితేజ సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దానికి కూడా సీక్వెల్ హింట్ ఇచ్చాడు దర్శకుడు. సినిమా ఫలితం చూశాక సీక్వెల్ ఊసే ఎత్తలేదు. ఈ ఏడాది కాలంలో మరి కొన్ని చిత్రాలకు ఇలా సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్ అనౌన్స్ చేసి తర్వాత వెనక్కి తగ్గారు. ఈ వారం సినిమాల విషయంలోనూ అలాగే జరిగేలా ఉంది. రామ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద మూవీ గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
మాస్ ప్రేక్షకులు సినిమాకు కొంతమేర కనెక్ట్ అయ్యారు కానీ.. సినిమాలో పెద్దగా విషయం లేదు. సామాన్య ప్రేక్షకులకు సినిమా చూసి తలపోటు వచ్చేసింది. కాంబినేషన్ క్రేజ్ వల్ల, పక్కా మాస్ మూవీ కావడం వల్ల ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ సినిమా వీకెండ్ తర్వాత నిలవడం కష్టమే అనిపిస్తోంది. కథలో ఏ విశేషం లేని సినిమాకు సీక్వెల్ తీయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు.
రిజల్ట్ కూడా సీక్వెల్‌ను నిర్దేశిస్తుంది. అంతిమంగా స్కంద యావరేజ్ స్థాయిని దాటడం కష్టమే. కాబట్టి సీక్వెల్ ఆలోచన అటకెక్కినట్లే. ఇక శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా పెదకాపును రెండు మూడు భాగాలుగా తీయాలనుకున్నాడు. అందుకే ముందుగా పెదకాపు-1 అని రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పేరున్న హీరో కూడా లేకపోవడంతో సరైన ఓపెనింగ్స్ కూడా లేవు. సినిమాకు కమర్షియల్‌గా చేదు అనుభవం తప్పేలా లేదు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడే వేస్ట్ అయ్యేలా ఉన్నపుడు ఇక దీనికి సీక్వెల్ ఎలా తీస్తారు?
This post was last modified on September 30, 2023 10:01 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…