డిసెంబర్ లో సలార్ వస్తుందో రాదో ఇంకా హోంబాలే ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ సంక్రాంతికి సంబంధించి వేరే సినిమాలు తమ డేట్లను అఫీషియల్ చేసుకుంటున్నాయి. గుంటూరు కారం జనవరి 12 తేదీని ఎప్పుడో తీసుకుంది. ఇవాళ విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబో మూవీని పండగకే తీసుకొస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. హనుమాన్ ఎప్పటి నుంచో మహేష్ బాబుతో క్లాష్ అయినా పర్వాలేదని డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈగల్ కూడా నేను సైతం అంటూ విడుదల తేదీని అధికారికం చేసుకుంది.
వరల్డ్ వైడ్ జనవరి 13న ఈగల్ థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. ఇది కొద్దివారాలుగా లీకుల రూపంలో తిరుగుతున్న న్యూసే కానీ టీమ్ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ లో ఎంతో కొంత అనుమానాలు నెలకొంటు వచ్చాయి. ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో రవితేజ పలురకాల గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ట్రీట్ మెంట్ వైజ్ హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంటుందని యూనిట్ ఇప్పటికీ తెగ ఊరిస్తోంది. ఈ రోజు వదిలిన లుక్ తో సహా గతంలో ఇచ్చిన పోస్టర్లు, టీజర్ అంచనాలు పెంచేవిగానే ఉంటూ వచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈగల్ లో కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డవ్జాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సో ఇప్పుడు ఈగల్ కన్ఫర్మ్ చేసుకోవడంతో జనవరి రేస్ ఇంకా ఆసక్తికరంగా మారింది. సలార్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు చాలా అనూహ్యంగా మారిపోతూ ఉండటంతో మిగిలినవాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎలాగూ ప్రభాస్ సంక్రాంతికి రాడనే సమాచారం పక్కాగా ఉండటంతో ఈ రకంగా ప్రకటనల వెల్లువ ముంచెత్తుతోంది. మరి అందరూ మాటకు కట్టుబడి ఉంటారా ఒకరిద్దరు డ్రాప్ అవుతారానేది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates