చేసింది కొన్ని సినిమాలే అయినా యాంకర్ కం హీరోయిన్ గా గుర్తుండిపోయిన కలర్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత థియేటర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మంత్ అఫ్ మధు వచ్చే నెల 6 విడుదల కాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ ఇవాళ ఒక ఈవెంట్ లో లాంచ్ చేశారు. సాయి తేజ్ గెస్టుగా హాజరవ్వగా ఆన్ లైన్ వెర్షన్ ని కొంత ఆలస్యంగా వదిలారు. భానుమతి అండ్ రామకృష్ణతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ నగోతి ఈ ఎమోషనల్ డ్రామాకు దర్శకుడు. మూడున్నర నిమిషాల వీడియోలో కథ మొత్తంగా స్పష్టంగా ఓపెన్ చేశారు.
అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మధు(శ్రేయ నవిలే) ఊబకాయంతో బాధ పడుతూ ఉంటుంది. బోలెడు ఆత్మవిశ్వాసం ఉన్నా లావుగా ఉన్న కారణంగా తల్లి(మంజుల)సైతం అవమానిస్తూ ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో తాగుడుకి బానిసైన ఓ మధ్య వయస్కుడు(నవీన్ చంద్ర) పరిచయమవుతాడు. తన గతాన్ని వివరిస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయి(స్వాతి రెడ్డి)కి విడాకులు ఇవ్వాలనుకునే దాకా కుటుంబ పరిస్థితులు ఎలా దారి తీశాయో చెబుతాడు. అసలు మధుకి అతనికి స్నేహం ఎలా కుదిరింది, రెండు కథలు ఏ మజిలీకి దారి తీశాయనేదే అసలు స్టోరీ.
మంచి ఎమోషన్స్ తో దర్శకుడు శ్రీకాంత్ నగోతి ఫెమినిస్ట్ భావాలతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. డైలాగులు, భావోద్వేగాలు అన్నీ మహిళల కోణంలో సాగాయి. అందరూ స్వాతి రెడ్డిదే మెయిన్ క్యారెక్టర్ అనుకున్నారు కానీ శ్రేయ నవిలే అంతే సమానమైన పాత్ర దక్కించుకుంది. నవీన్ చంద్ర రెండు షేడ్స్ లో విభిన్నంగా కనిపించాడు. పరిమిత బడ్జెట్ లో అయినా యాక్టింగ్ క్వాలిటీతో కంటెంట్ రిచ్ గా ఉంది. అక్టోబర్ 6న చిన్న సినిమాల మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో జనాన్ని థియేటర్ దాకా తీసుకురావడం మంత్ అఫ్ మధుకి సవాలే. టాక్ బ్రహ్మాండంగా వస్తే అదేం కష్టం కాదు.
This post was last modified on September 26, 2023 11:33 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…