ఖుషి ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ విజయ్ దేవరకొండ మరీ తీవ్రంగా నిరాశ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, డియర్ కామ్రేడ్ కన్నా మంచి రిజల్ట్ వచ్చిందనే ఆనందమైతే దక్కింది. కొంచెం సీరియస్ గా ఫోకస్ చేసి సరైన కాంబోలో సినిమాలు చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని అర్థమైపోవడంతో దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పరశురామ్ పేట్ల, గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపిన రౌడీ హీరో నెక్స్ట్ రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలాకు ఓకే చెప్పేశాడు. ఏ నిమిషంలో అయినా అధికారిక ప్రకటన రావొచ్చు. కిరణ్ అబ్బవరంకి డెబ్యూ చేసిన రవినే ఇతను.
నిర్మాత దిల్ రాజుకి విజయ్ దేవరకొండతో ఇది వరసగా రెండో సినిమా అవుతుంది. జానర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో రెగ్యులర్ ట్రీట్ మెంట్ కి భిన్నంగా వెరైటీ బాడీ లాంగ్వేజ్ తో క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలిసింది. ప్రస్తుతానికి ఇంతకు మించి లీక్ అయితే లేదు. రాజావారు రాణిగారు మరీ బ్లాక్ బస్టర్ అనిపించుకోకపోయినా దాన్ని హ్యాండిల్ చేసిన విధానం రవికిరణ్ కు పేరు తీసుకొచ్చింది. యూత్ ని ఆకట్టుకునేలా అందులో పొందుపరిచిన వినోదం వర్కౌట్ అయ్యింది. అయితే ఈసారి జానర్ ని మార్చి పూర్తిగా సీరియస్ వైపు వెళ్లిపోవడం విశేషం.
వచ్చే ఏడాది ఖచ్చితంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా విజయ్ దేవరకొండ ప్లాన్ చేసుకుంటున్నాడు. స్టార్ దర్శకులతో జోడి కట్టాలంటే ఓ పెద్ద రేంజ్ బ్లాక్ బస్టర్ తనకు అవసరం. పుష్ప టైంలో ఓకే చెప్పిన సుకుమార్ ప్రాజెక్ట్ ఆ తర్వాత పక్కకు వెళ్ళడానికి కారణం తన ట్రాక్ రికార్డేనని గుర్తించి దాన్ని బలపరుచుకునే పనిలో ఉన్నాడు. రవికిరణ్ లాంటి అప్ కమింగ్ డైరెక్టర్లతో చేయడం కొంత రిస్క్ అయినప్పటికీ గీత గోవిందం, టాక్సివాలా, పెళ్లి చూపుల డైరెక్టర్లు తర్వాత పెద్ద స్థాయికి చేరుకోవడం గమనించాల్సిన విషయం. రవికిరణ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఇదే అయ్యుంటుంది.
This post was last modified on September 26, 2023 11:15 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…