Movie News

పూజా హెగ్డేకు ఓ పెద్ద ఛాన్స్

హీరోయిన్లు స్టార్లుగా ఎదగడం.. అలాగే మంచి స్థాయి నుంచి కిందికి పడిపోవడం చాలా వేగంగా జరిగిపోతుంటుంది. ‘పెళ్ళిసంద-డి’ అనే ఔట్ డేటెడ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల.. ఎంత వేగంగా టాప్ హీరోయిన్ అయిపోయిందో తెలిసిందే. అలాగే టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఉన్నట్లుండి సినిమాలు లేక ఖాళీ అయిపోయింది.

ముందేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా ఆలస్యం అవుతోందని దాన్నుంచి తప్పుకుంది పూజా. ఆ తర్వాతేమో ఆమెను మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ నుంచి తప్పించేశారు. కొత్తగా ఏ పెద్ద సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకోలేకపోతోంది. కొత్త ప్రాజెక్టుల గురించి వార్తలు కూడా ఏమీ రావట్లేదు. ఇలాంటి టైంలో ఆమెకు బాలీవుడ్లో ఒక క్రేజీ మూవీలో ఆఫర్ రావడం ఊరటనిచ్చేదే.

బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన షాహిద్ కపూర్‌తో జట్టు కట్టబోతోంది పూజా హెగ్డే. వీరి కలయికలో రాబోతున్న సినిమా ‘కోయి షక్’. ఇదొక థ్రిల్లర్ మూవీ అట. ఇందులో పూజా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించబోతోందట. మలయాళంలో ‘కాసనోవా’, ‘ముంబయి పోలీస్’, ‘సెల్యూట్’ లాంటి థ్రిల్లర్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నాడు.

‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అయ్యాక షాహిద్‌కు సరైన విజయం దక్కలేదు. జెర్సీ, బ్లడీ డాడీ నిరాశపరిచాయి. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్‌తో మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడతను. ఇలాంటి సమయంలో రోషన్‌తో జట్టు కడుతున్నాడు. రాధేశ్యామ్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కా జాన్.. ఇలా ఓవైపు వరుసగా డిజాస్టర్లు చవిచూస్తూ.. కొత్త సినిమాలు చేజారుతున్న దశలో పూజాకు ఇది పెద్ద ఛాన్స్ అనే చెప్పాలి.

This post was last modified on September 25, 2023 6:13 pm

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

1 hour ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

2 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

2 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

3 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

3 hours ago