డెబ్యూ ఎంత పెద్ద హిట్ అయినా ఒక్క డిజాస్టర్ చాలు దర్శకుల అవకాశాలను దూరం చేయడానికి. తిరిగి ఇంకో ఛాన్స్ పట్టాలన్నా ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. చిలసౌతో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత ఏకంగా నాగార్జునతో ఛాన్స్ కొట్టేశాడు. కల్ట్ క్లాసిక్ మన్మథుడుకి 2 నెంబర్ తగిలించి కింగ్ ని లేట్ ఏజ్ రొమాన్స్ లో చూపాలనుకున్న ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. ఫ్లాప్ కావడం పక్కనపెడితే అందులో కంటెంట్, ప్రెజెంటేషన్ అభిమానుల నుంచే కాదు సగటు ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు అందుకుంది.
దీంతో సహజంగానే రాహుల్ కి గ్యాప్ వచ్చేసింది. రష్మిక మందన్నకు ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ చెప్పి మెప్పించినట్టు లేటెస్ట్ అప్ డేట్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తారని తెలిసింది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ప్రకటన లాంఛనమే. నిజానికిది తొలుత సమంతాతో ప్లాన్ చేశారు. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయితో సామ్ స్నేహం ఈ ప్రాజెక్టుకి దారి తీసింది. అయితే యశోద నుంచి అనారోగ్యం ఇబ్బంది పెట్టడంతో ఇది చేసే పరిస్థితి లేకపోయింది. శాకుంతలం, సిటాడెల్, ఖుషి పూర్తి చేసి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిపోయింది.
తన స్థానంలోనే రష్మికని లాక్ చేసినట్టుగా తెలిసింది. ఆల్రెడీ తను బటర్ ఫ్లై అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తోంది. ఇప్పుడిది రెండోది అవుతుంది. యానిమల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న శ్రీవల్లి దీంతో పాటు పుష్ప 2 ది రూల్ మీద పెద్ద ఆశలే పెట్టుకుంది. బాలీవుడ్ పాత్ బ్రేకింగ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందని దీని మీద మామలు అంచనాలు లేవు. కెరీర్ పరంగా శ్రీలీల వచ్చాక కొంచెం వెనుకబడినట్టు కనిపిస్తున్న రష్మిక మందన్న హిందీ ఆఫర్ల కోసం సౌత్ ని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే ఇకపై తెలుగు తమిళంకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on September 25, 2023 3:16 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…