సెప్టెంబర్ చివరి వారం కోసం ప్లాన్ చేసుకున్న గేమ్ ఛేంజర్ షెడ్యూల్ వాయిదా వేస్తూ అధికారికంగా చెప్పేశారు. ఇలా జరగడం కొత్త కాకపోయినా టీమ్ నుంచి నోట్ రావడం మాత్రం అరుదే. హీరోయిన్ కియారా అద్వానీతో డేట్స్ తీసుకున్నాక కూడా ఈ సమస్య రావడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అసలు కారణం ఏంటాని ఆరా తీస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు శంకర్ ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్ కోసం క్యాస్టింగ్ మొత్తం పాల్గొనాల్సి ఉందట. అయితే కొందరు ఆర్టిస్టుల కాల్ షీట్లు ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాకపోవడంతో క్యాన్సిల్ చేయలేక తప్పలేదని వినికిడి.
ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన పేరు ఎస్ జె సూర్య. గేమ్ ఛేంజర్ లో తనే మెయిన్ విలన్. అయితే ఆర్టిస్టుగా ఇతను చాలా బిజీ ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ తీస్తున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ కీలక భాగం ఈ నెలలోనే ఉంది. మొన్నటిదాకా మార్క్ ఆంటోనీ ప్రమోషన్ల కోసం డైరీని ఖాళీగా ఉంచుకున్న ఎస్జె సూర్య హైదరాబాద్ లో ఉన్నప్పుడైనా గేమ్ ఛేంజర్ షూట్ ఉంటే కొంత వరకు కవరైపోయేది. సునీల్, జయరాం, శ్రీకాంత్ లు ఒకేసారి అందుబాటులోకి రాలేకపోతున్నారు. ఈ సమస్య పట్టిపీడించడం వల్లే తప్పని పరిస్థితిలో పోస్ట్ పోన్ చేసుకున్నారు. వచ్చే నెల రెండో వారంలో కొనసాగిస్తారు.
ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబందించి ఇప్పట్లో నిర్ణయం తీసుకోవడం కష్టమే. అవతల ఇండియన్ 2 కూడా ఇదే స్టేజిలో ఉండటంతో శంకర్ మీద ఒత్తిడి అంతకంతా పెరుగుతోంది. రెండు ప్యాన్ ఇండియా సినిమాలే కావడం మరో చిక్కు. వీటిలో ఒకటి ఖచ్చితంగా 2024 ఇండిపెండెన్స్ డేకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది ఎంత మేరకు సాధ్యమవుతుందో పోస్ట్ ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. తమన్ పాటల్లో ఒకటి ఆల్రెడీ లీకైపోగా టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయి తీయించేసింది కానీ సాంగ్ అప్పటికే విపరీతంగా వైరలైపోయింది.
This post was last modified on September 24, 2023 7:34 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…