కన్నడలో ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన అమ్మాయి రష్మిక మందన్నా. కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. వెంటనే ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం హడావుడి పడలేదు. రక్షిత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండగానే రష్మిక.. తెలుగులో అవకాశాలు అందుకుంది.
ఇక్కడికొచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. ఈ క్రమంలోనే ఆమె రక్షిత్ నుంచి విడిపోయింది. ఈ విషయంలో కన్నడిగులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ప్రయారిటీ పెరిగేసరికి కన్నడ ఇండస్ట్రీని, అలాగే రక్షిత్‌ను ఆమె మరిచిపోయిందని, అతణ్ని మోసం చేసిందని తనపై విరుచుకుపడ్డారు. అంతే కాక బ్రేకప్ తర్వాత రక్షిత్, రష్మిక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కూడా వార్తలొచ్చాయి.
ఐతే రష్మికతో ఇప్పటికీ తనకు మంచి స్నేహమే ఉందని అంటున్నాడు రక్షిత్. తామిద్దరం తరచుగా మాట్లాడుకుంటామని.. మెసేజ్‌లు కూడా చేసుకుంటామని అతను తెలిపాడు. కానీ తమ కామన్ ఫ్రెండ్ అయిన రిషబ్‌కు, రష్మికకు మధ్య మాత్రం ఏం జరుగుతోందో తనకు తెలియదని అతనన్నాడు. ‘‘రిషబ్ సంగతి నాకు తెలియదు. నేను, రష్మిక మాత్రం మాట్లాడుకుంటున్నాం.
నా సినిమా రిలీజైతే తను విష్ చేస్తుంది. అలాగే తన చిత్రం ఏదైనా విడుదలైతే నేను విష్ చేస్తా. కెరీర్ విషయంలో తను ఎన్నో కలలు కంది. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది” అని రక్షిత్ తెలిపాడు. ‘కాంతార’ రిలీజ్ టైంలో రిషబ్, రష్మికల మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. ఆమె ఆ సినిమా చూడలేదని వ్యాఖ్యానించగా.. ఓ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వస్తే వేరే ప్రశ్న అడగాలని రిషబ్ కోపంగా మాట్లాడటం చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 24, 2023 3:41 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…