Movie News

బృందావన కాలనీ లెక్క ఎక్కడ తప్పింది

ఏడాది కాలంగా తెలుగు ప్రేక్షకులను రీ రిలీజులు ఎంతగా ముంచెత్తుతున్నాయో చూస్తున్నాం. ఆరంజ్, సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3 లాంటివి ఒరిజినల్ టైం కన్నా భారీ వసూళ్లు దక్కించుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. అయితే అన్ని ఇదే బాటలో కనకవర్షం కురిపిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. దానికి ఉదాహరణగా నిలుస్తోంది కల్ట్ క్లాసిక్ 7జి బృందావన కాలనీ. మొన్న శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా మంచి టైమింగ్ చూసుకుని విడుదల ప్లాన్ చేయడంతో  హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమని అందరూ భావించారు. అయితే జరిగింది వేరు.

హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, పట్టణాలు చాలా చోట్ల సగం ఆక్యుపెన్సీ లేక బయ్యర్లు డీలా పడ్డారు. కాంపిటీషన్ లేదు కాబట్టి యూత్ దీని కోసం ఎగబడతారని వేసిన అంచనా పూర్తిగా తప్పింది. ఫస్ట్ డే కోటి రూపాయలకు పైగా వచ్చిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు కానీ అందులో వాస్తవమెంతో చెప్పలేం. ఆర్టిసి క్రాస్ రోడ్స్, వైజాగ్, విజయవాడ లాంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే సందడి కనిపించింది తప్ప మిగిలిన చోట్ల రెస్పాన్స్ సోసోనే.

ఆలా అని 7జి బృందావన కాలనీకి కాలదోషం పట్టిందని కాదు కానీ అసలు జనం పండగ వాతావరణంలో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ముఖ్యంగా కుర్రకారు టికెట్లకు ఖర్చు పెట్టే డబ్బులు మిగిలించుకుంటే నిమజ్జనం రోజు ఎంజాయ్ చేయొచ్చనే ఆలోచనతో సినిమా ఆప్షన్ ని లైట్ తీసుకున్నారు. దీంతో ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడింది. దీనికి తోడు గత మూడు నెలల్లో రీ రిలీజులు విపరీతంగా వచ్చేసి ఆడియెన్సు జేబులకు గట్టిగానే చిల్లులు పెట్టాయి. దాంతో సహజంగానే నెలాఖరు దగ్గరగా ఉన్న టైంలో సైలెంటైపోయారు. ఇలా ఒక క్లాసిక్ కి దక్కాల్సిన గౌరవమైతే రాలేదు. 

This post was last modified on September 24, 2023 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

2 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

4 hours ago

రాజాసింగ్…క‌న‌బ‌డుట‌లేదు!

రాజాసింగ్‌... రాజ‌కీయాల ప‌ట్ల క‌నీస ప‌రిచ‌యం ఉన్న‌వారికి ఎవ‌రికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి  కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు.…

5 hours ago

ఎంపీ అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…

8 hours ago

నయన్‌పై ధనుష్ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…

8 hours ago