మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మీద అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. కరోనా వల్ల బయట పెద్దగా సంబరాలు చేసుకునే అవకాశం లేకపోయినా.. ఆయన కొత్త సినిమాల ముచ్చట్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుందని ఆశించారు. కానీ వాళ్లను చిరు నిరాశ పరిచాడనే చెప్పాలి. వాళ్లు టీజర్ వస్తుందనుకుంటే మోషన్ పోస్టర్‌తో సరిపెట్టారు. చిరు కొత్త సినిమా టైటిల్ ‘ఆచార్య’ అన్నది ఎప్పుడో ఖరారైపోయింది. టైటిల్ ప్రకటన కొత్త విషయం కాదు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో విషయం ఉన్నప్పటికీ.. చిరును లాంగ్ షాట్లో, వెనుక నుంచి చూపించడం, ముఖం కూడా సరిగా కనిపించకపోవడం అభిమానులకు అంతగా రుచించలేదు. ఫస్ట్ లుక్ అభిమానులు ఆశించినట్లయితే లేదన్నది వాస్తవం. ‘ఆచార్య’ ముచ్చట పక్కన పెడితే.. చిరు పుట్టిన రోజు నాడు కొత్త సినిమాల ప్రకటనలు ఉంటాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది.
‘లూసిఫర్’ రీమేక్‌ను ప్రకటిస్తారని.. బాబీతో సినిమా గురించి కూడా ప్రకటన ఉంటుందని.. మెహర్ రమేష్‌తో చేయనున్న ‘వేదాళం’ రీమేక్ గురించి కూడా అనౌన్స్‌మెంట్ ఉంటుందని.. ఇలా కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరిగాయి. తన కొత్త సినిమాలు మూడు లైన్లో ఉన్నట్లు చిరంజీవి కూడా ఇంతకుముందే వెల్లడించాడు. అభిమానులు వీటిని దాటి చిరు కోసం లైన్లో ఉన్న త్రివిక్రమ్, హరీష్ శంకర్‌లతో సినిమాల ఊసులేమైనా వినిపిస్తాయా అని కూడా చూశారు. కానీ చిరు పుట్టిన రోజుకు కేవలం ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌తో సరిపెట్టేశారు. వేరే సినిమాల గురించి ఎక్కడా చప్పుడే లేదు.
మరి ఈ విషయంలో చిరు ఇప్పుడు సందర్భం కాదని ఉద్దేశపూర్వకంగా ఆ అనౌన్స్‌మెంట్లు చేయకుండా ఆపాడా.. లేక ఆ సినిమాల సంగతి ఇంకా ఏమీ ఖరారకపోవడం వల్ల, లేదా వేరే సందర్భం చూసి వెల్లడిద్దాం అనుకోవడం వల్ల ఆగారా అన్నది తెలియడం లేదు.
This post was last modified on August 24, 2020 10:13 am
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…