కెరీర్ ఆరంభంలో వరుసగా విజయాలు వచ్చాయంటే ఆ హీరోయిన్ని నెత్తిన పెట్టుకుంటుంది ఫిలిం ఇండస్ట్రీ. అందులోనూ తొలి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా.. హీరోయిన్ ప్లస్ కావడం వల్ల అది సక్సెస్ అయితే ఇంకేమైనా ఉందా? పెళ్లిసంద-డి చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల ఈ కోవలోనే టాలీవుడ్లో డిమాండ్ తెచ్చుకుంది. తన రెండో సినిమా ధమాకా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె స్టార్ స్టేటస్ సంపాదించింది.
అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా ఉండటంతో శ్రీలీల చూస్తుండగానే బిజీ హీరోయిన్ అయిపోయింది. రాబోయే నాలుగు నెలల్లో ఆమె సినిమాలు ఐదు దాకా రిలీజ్ కాబోతున్నాయంటే.. అందులో మహేష్ బాబు సరసన చేసిన గుంటూరు కారం కూడా ఉందంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఇప్పుడు శ్రీలీలకు ఒక ఊహించని కష్టం వచ్చిందట. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకే డేట్లు సర్దుబాటు చేయలేక.. కొత్తగా మంచి ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోలేక శ్రీలీల బాగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కథానాయికగా ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ గురించి అందరూ ఎగ్జైట్ అయ్యారు.
కానీ ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వలేక బయటికి వచ్చేసిందట శ్రీలీల. అంతే కాక ధమాకా తర్వాత రవితేజతో మళ్లీ జట్టు కట్టే అవకాశం వచ్చినా అంగీకరించలేకపోయిందట. గోపీచంద్ మలినేని సినిమాలో ముందు శ్రీలీలనే కథానాయికగా అనుకున్నా.. ఆమె ఈ సినిమాకు డేట్లు ఇవ్వలేకపోవడంతోనే రష్మిక మందన్నాను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకే డేట్లు క్లాష్ అవుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆమె కొత్త సినిమాలేవీ ఒప్పుకునే పరిస్థితి లేదట.
This post was last modified on September 24, 2023 8:41 am
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…