చంద్రముఖి అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది రజినీ పేరే. జ్యోతిక కూడా అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ రజినీ పెర్ఫామెన్స్ అంత సులువుగా మరిచిపోదగ్గది కాదు. సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది రజినీనే అనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రాగా.. వాటిలో రజినీ నటించలేదు. చంద్రముఖికి కొనసాగింపుగా తెలుగులో నాగవల్లి తీసిన పి.వాసు.. వెంకటేష్‌ను హీరోగా ఎంచుకున్నాడు.
ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడాయన తమిళంలో వేరుగా సీక్వెల్ తీశారు. అందులో లారెన్స్ హీరోగా చేశాడు. ఐతే రజినీ లేకుండా చంద్రముఖి సీక్వెల్ ఏంటి అని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. కాగా రజినీకి ఈ కథ చెబితే ఆయన తిరస్కరించారని.. దీంతో లారెన్స్‌ను వాసు అప్రోచ్ అయ్యాడని ఒక ప్రచారం ఉంది.
చంద్రముఖి-2 తెలుగు ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న పి.వాసును విలేకరులు ఇదే విషయం అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు చంద్రముఖి-2 స్టోరీ రజినీకి వినిపించనే లేదని.. ఒక్క లైన్ కూడా ఆయనకు చెప్పలేదని.. ఇక ఆయన రిజెక్ట్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
రజినీతో ఈ సినిమా తీయాలంటే ఆయన పాత్రనే కొనసాగించాలని.. ఐతే తాను వేరే పాత్రను సృష్టించి అందుకు తగ్గట్లు కథను అల్లామని.. అలాంటపుడు రజినీ ఈ సినిమా ఎలా చేస్తారని ఆయన అన్నాడు. కొత్త పాత్రను ఏ హీరో అయినా చేయొచ్చని.. కాబట్టే ఇందులోకి లారెన్స్ వచ్చాడని వాసు తెలిపాడు. ఇక చంద్రముఖి-2 చివర్లో మరో సీక్వెల్ కోసం హింట్ ఉంటుందని.. అవకాశాన్ని బట్టి చంద్రముఖి-2 కూడా చేస్తామని వాసు చెప్పాడు. ఈ సినిమాలో చివరి అరగంట ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని వాసు తెలిపాడు.
This post was last modified on September 24, 2023 8:38 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…