టాలీవుడ్ లో బిజీ అండ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీలనే. వేరే ఆప్షన్ లేదు. చేతి నిండా సినిమాలతో నెలకు కనీసం ఒక్క రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం తనకే చెల్లింది. ముందే అనుకుని చేసేది కాకపోయినా మహేష్ బాబు నుంచి వైష్ణవ్ తేజ్ దాకా అందరూ తననే జోడిగా కోరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అయితే ఈ అమ్మడి డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. రెమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చినా సరే నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు కానీ శ్రీలీల డేట్స్ పట్టుకోవడం మాత్రం పెద్ద సవాల్ గా మారుతోంది.
ఈ విషయానికి సంబంధించి హీరో రామ్ ఒక పేలిపోయే కామెంట్ చేశాడు. మాములుగా శ్రీలీల డే అఫ్(సెలవు)తీసుకుంటే ఏం చేస్తుందనే ఓ ఇంటర్వ్యూ ప్రశ్నకు భలే సమాధానం చెప్పాడు. ఈ అమ్మాయి కనక షూటింగులకు బ్రేక్ తీసుకుంటే అది ఇండస్ట్రీ మొత్తానికి హాలిడే ఇచ్చినట్టేననే, అయితే ప్రీ లేదా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం తప్ప ఇంకేం చేయలేరని తేల్చి చెప్పాడు. అంటే ముప్పాతిక పైగా పెద్ద సినిమాల్లో తనే హీరోయిన్ కాబట్టి బిజీగా ఉండటం తప్ప ఇంకో ఛాయస్ లేదని అనేశాడు. ప్రతి శుక్రవారం కొత్త హీరోతో ప్రమోషన్ లో పాల్గొనాల్సిందేనని పంచు వేశాడు.
రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల అచ్చంగా అదే ఫేజ్ లో ఉంది. ఒకవైపు చిత్రీకరణలు, మరో వైపు విడుదలకు సిద్ధంగా ఉన్న వాటి కోసం పాల్గొనాల్సిన ప్రమోషన్లు, మీడియాకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూలు ఒకటా రెండా డైరీ బాగా ప్యాక్ అయిపోతోంది. ఈ నెల స్కందతో పలకరిస్తే అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్ లో ఆదికేశవ, డిసెంబర్ లో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్, జనవరిలో గుంటూరు కారం ఇలా వరసగా లైనప్స్ ఉన్నాయి. దాదాపు అన్నీ సగంపైగానే పూర్తయ్యాయి. డిసెంబర్ లో ఎంబిబిఎస్ పరీక్షల కోసం శ్రీలీల నిజంగానే లీవులు పెట్టనుండటం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on September 23, 2023 10:02 pm
https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…
ఒకపక్క కామెడీ వేషాలు ఇంకోవైపు విలన్ పాత్రలు వేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా నడిపిస్తున్న సునీల్ కు కోలీవుడ్ లో…
అంతా అనుకున్నట్టే అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండానే జనసేన ఓ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా…
తమిళ జనాలకు మహేంద్రసింగ్ ధోని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆ జట్టుకు…
తమిళంలో ఆ మధ్య పెరుసు అనే సినిమా రిలీజయ్యింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. తెలుగు డబ్బింగ్ తో పాటు…
గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్…