Movie News

స్వంత ఇంటి కోసం బారు పెట్టిన కుమారి

మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి విలక్షణ చిత్రాలతో మొదలుపెట్టి ప్రాజెక్ట్ కె దాకా అడుగులు వేసిన స్వప్న సినిమా ఇప్పుడు ఓటిటి మూవీస్ కూడా అందించనుంది. నిత్య మీనన్ టైటిల్ పాత్ర పోషించిన కుమారి శ్రీమతి ఈ నెల 28న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నానితో ట్రైలర్ విడుదల చేయించారు. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తోంది. గోమటేష్ ఉపాధ్యే దర్శకత్వంలో రీజనబుల్ బడ్జెట్ లో కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసినట్టున్నారు. కథ ఏంటో స్పష్టంగా రెండు నిమిషాల వీడియోలో చెప్పేశారు.

ముప్పై ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాని అమ్మాయి పేరు శ్రీమతి(నిత్య మీనన్). తమ నుంచి అన్యాయంగా తీసుకున్న పాత ఇల్లుని బాబాయ్ నుంచి తీసుకోవడమే లక్ష్యంగా కోర్టులో పోరాడుతుంది. ప్రేమంటూ ఓ అబ్బాయి(తిరువీర్)వెంటపడుతూ ఉంటాడు. అయితే డబ్బు చెల్లించి ఆ ఇంటిని స్వంతం చేసుకోవచ్చంటూ తీర్పు రావడంతో తన పదమూడు వేల జీతంతో అది అసాధ్యమని గుర్తిస్తుంది. ఆరు నెలల గడువులో అంత డబ్బు సంపాదించాలంటే మద్యం వ్యాపారం చేయడం ఒక్కటే మార్గమని అర్థమై అన్నంత పని చేస్తుంది. ఇక్కడి నుంచి అసలు సవాళ్లు మొదలవుతాయి

పాయింట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. వినోదమే ప్రధానంగా ప్రేక్షకులను నవ్వించడమే టార్గెట్ పెట్టుకున్నారు గోమటేష్. తిరువీర్ తో పాటు గౌతమి, నిరుపమ్, ప్రణీత, తాళ్ళూరి రామేశ్వరి, మురళీమోహన్ లాంటి క్యాస్టింగ్ తోడవ్వడంతో క్వాలిటీ కనిపిస్తోంది. ఇంటిల్లిపాది చూసేందుకు కావాల్సిన కాలక్షేపమైతే దట్టించారు. అయితే హీరోయిన్ డబ్బు కోసం బారు పెట్టుకోవడమనే బ్యాక్ డ్రాప్ వెరైటీగా ఉంది.ఇది కన్విన్సింగ్ గా చెప్పగలిగితే చాలు హిట్టు పడ్డట్టే. ఇలాంటి కంటెంట్ ఓటిటికి పర్ఫెక్ట్ ఛాయస్. బాగుంటే చాలు మిలియన్ల వ్యూస్ వచ్చి పడతాయి. నిత్య మీనన్ ఎలాంటి మేజిక్ చేసిందో చూడాలి.

This post was last modified on September 22, 2023 7:56 pm

Share

Recent Posts

వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి…

13 minutes ago

ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మ‌ధ్యంతర ఎన్నిక‌ల సెగ భారీగా త‌గిలేలా క‌నిపిస్తోంది. మ‌ధ్యంతర ఎన్నిక‌లు వ‌చ్చే అక్టోబ‌రు-న‌వంబ‌రు మాసాల…

1 hour ago

బుచ్చిబాబు ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయంటే

పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…

3 hours ago

సిద్దు సుమంత్ ఇద్దరికీ పనవ్వాలి

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్…

3 hours ago

H-1B ఉద్యోగి కోసం అదనపు ఫీజా… అమెరికా ప్లాన్ ఏంటి?

అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B…

3 hours ago

రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం… కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన…

4 hours ago