ప్రపంచంలో ప్రతి ఫిలిం మేకర్ కలలు కనే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు గాను కీరవాణికి వచ్చిన తర్వాత అందరికీ దాని మీద ఆశ కలుగుతోంది. మాకెందుకు రాదనే ధీమా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లలో పెరుగుతోంది. ఇటీవలే జవాన్ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన అట్లీ సైతం తాము నామినేషన్ కు పంపే ఆలోచనలో ఉన్నామని చెప్పడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దారి తీసింది. కలగూరగంపలా పాత మసాలా సినిమాల ప్రభావంతో తీసిన చిత్రాన్ని అకాడెమి అవార్డులకు పంపి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజెన్లు గట్టిగానే తలంటారు.
అతనేదో ఫ్లోలో అన్నాడు కానీ నిజానికది జరిగేంత సీన్ లేదు కానీ ప్రస్తుతం చెన్నైలో ఇండియా తరఫున ఎంట్రీగా పంపాల్సిన సినిమాల స్క్రీనింగ్ జరుగుతోంది. గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన వీటి వడబోత చేపట్టారు. తెలుగు నుంచి బలగం, దసరా మాత్రమే పరిశీలనలో ఉంది. హిందీ నుంచి ది స్టోరీ టెల్లర్ – మ్యూజిక్ స్కూల్ – జ్విగాటో – గదర్ 2 – ఘోమర్ – అబ్ తో సాబ్ భగవాన్ భరోస్ – ది కేరళ స్టోరీ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని – మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే తదితరాలున్నాయి. వెట్రిమారన్ విడుదలై పార్ట్ 1 ని గట్టి పరిశీలనలో ఉంచారట. ఇవి కాకుండా ఇతర బాషలవి వేరేవి చాలా ఉన్నాయి.
అయితే ఇక్కడ చెప్పిన లిస్టులో ఉన్నవి ఎక్కువ శాతం కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలు. ఆస్కార్ అంత సులభంగా వీటిని ఒప్పుకోదు. ఆర్ఆర్ఆర్ ఎంత గొప్పగా తీసినా దర్శకుడు రాజమౌళికి పురస్కారం దక్కలేదు. నిర్మాత దానయ్యకు పిలుపు అందలేదు. సో ఏదో మన ప్రయత్నం చేయడం కోసమని పంపడం తప్పించి ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార ఈవెంట్ కోసం వీటిలో ఎంపిక చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ ని అఫీషియల్ ఎంట్రీగా కేంద్రం పంపకపోవడం వల్లే అవకాశం తగ్గిందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 22, 2023 1:47 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…