అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన యువ కథానాయకుడు సుశాంత్.. కెరీర్ ఆరంభంలో తన సొంత బేనర్లోనే వరుసగా సినిమాలు చేశాడు. అతడి తల్లి నాగసుశీల.. శ్రీనివాసరావు అనే ఓ వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించడం తెలిసిందే. ఐతే కొన్నేళ్లు అంతా బాగానే సాగింది కానీ.. తర్వాత ఆర్థిక విషయాల్లో సుశాంత్ కుటుంబానికి.. ఈ శ్రీనివాసరావుకు వివాదాలు తలెత్తాయి. చాలా ఏళ్ల ముందే శ్రీనివాసరావు.. నాగసుశీల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పట్లో వ్యవహారం కేసుల వరకు వెళ్లింది.
మధ్యలో ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగింది కానీ.. ఇప్పుడు మళ్లీ గొడవ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. సుశాంత్, నాగసుశీలలపై శ్రీనివాసరావు కేసు పెట్టాడు. తాను ఒక ట్రస్టుకు ఇచ్చిన స్థలం దగ్గరికి బౌన్సర్లతో వచ్చి సుశాంత్, నాగసుశీల గొడవ చేశారని అతను ఆరోపిస్తున్నాడు. సీసీటీవీ వైర్లు కట్ చేసి మరీ గొడవ చేశారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కిందట కేసు నమోదు చేయాలని బాధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మీడియాకు కూడా కొన్ని ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేశాడు శ్రీనివాసరావు. ఈ వివాదం వెనుక బ్యాగ్రౌండ్ ఏంటన్నది తెలియడం లేదు కానీ.. దాదాపు పదేళ్లుగా శ్రీనివాసరావుకు, సుశాంత్ కుటుంబానికి మధ్య ఆర్థిక గొడవలు నడుస్తున్నాయి. అవి ఎంతకీ తీరకపోవడంతో ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాసరావు భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించడం ఆగిపోయాక.. సుశాంత్ సొంత బేనర్లో సినిమాలు చేయట్లేదు. ‘చి ల సౌ’ చిత్రాన్ని మాత్రం నాగ్ నిర్మించాడు. మిగతా సినిమాలన్నీ బయట బేనర్లలోనే చేస్తున్నాడు సుశాంత్.
This post was last modified on September 18, 2023 9:21 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…