సంక్రాంతికి ఇంకో నాలుగు నెలలే సమయం ఉండటంతో పండగ విడుదల టార్గెట్ చేసిన సినిమాలు మెల్లగా ప్రమోషన్లు పెంచుతున్నాయి. వీటిలో తేజ సజ్జ హనుమాన్ ఉంది. జనవరి 12 డేట్ ని నొక్కి వక్కాణిస్తూ పోస్టర్లు వదులుతూనే ఉన్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మరో లుక్ వదిలారు. అయితే ఇక్కడ సమస్య అది కాదు. అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం ఖచ్చతంగా వస్తుందని హీరో నిర్మాత పదే పదే చెబుతుంటే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎందుకింత ధీమాగా ఉన్నాడనే సందేహం మూవీ లవర్స్ లో సహజంగానే కలుగుతుంది.
ఇక్కడ అసలు మతలబు వేరే ఉంది. గుంటూరు కారం కేవలం తెలుగులో మాత్రమే వస్తుంది. అంటే బిజినెస్ ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు ఓవర్సీస్ లో జరుగుతుంది. తమిళంలో అంతగా పట్టించుకోరు. మలయాళంలో మార్కెటే లేదు. సో మహేష్ తాకిడికి పరిమితి ఉంది. కానీ హనుమాన్ అలా కాదు. తేజ సజ్జ చిన్న హీరోనే అయినప్పటికీ సినిమాలో ఉన్నది గ్లోబల్ కంటెంట్. ముఖ్యంగా నార్త్ లో విపరీతంగా ఆరాధించే హనుమంతుడి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. పైగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రశాంత్ వర్మ లేట్ అవుతున్నా సరే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆదిపురుష్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని వీలైనంత బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి హనుమాన్ యూనిట్ చాలా కష్టపడుతోందట. సో గుంటూరు కారంతో నేరుగా తలపడినా ఇబ్బంది ఉండదని. మొదటి రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ తగ్గినా ఆ తర్వాత అనూహ్యంగా పికప్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. ఒకవేళ టైంకి పూర్తి కాక గుంటూరు కారం తేదీ మార్చుకుంటే హనుమాన్ పంట పండినట్టే. అయినా రవితేజ, విజయ్ దేవరకొండలు కూడా రేస్ లో ఉంటారని తెలిసి కూడా ప్రశాంత్ వర్మ బృందం ఇంత రిస్క్ చేస్తోందంటే మ్యాటర్ ఏదో గట్టిగానే ఉన్నట్టుంది.
This post was last modified on September 18, 2023 4:31 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…