బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతున్న జవాన్ దిగ్విజయంగా ఎనిమిది వందల కోట్లు దాటేసి వెయ్యి మార్కు వైపు పరుగులు పెడుతోంది. అన్ని భాషల్లోనూ చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేకపోవడంతో నిన్న ఆదివారం కూడా పూర్తిగా కింగ్ ఖాన్ కంట్రోల్ లోకి వెళ్లిపోయింది. వరస సెలవులను వాడుకుంటూ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాడు. ప్రధాన కేంద్రాల్లో పది రోజుల తర్వాత టికెట్లు దొరకని పరిస్థితి దీనికే చూస్తున్నామని నార్త్ బయ్యర్లు అంటున్నారు. సహస్రం చేరుకోవడం లాంఛనంగానే కనిపిస్తోంది. నాన్ హిందీ వెర్షన్లు బాగా నెమ్మదించినా భయపడే స్థాయిలో జోరు తగ్గలేదు.
తాజా అప్డేట్ ఏంటంటే జవాన్ ఎడిటింగ్ లో లేపేసిన ఫుటేజ్ లో 20 నిమిషాలను తీసుకుని డైరెక్టర్ కట్ పేరుతో కొత్త వెర్షన్ సిద్ధం చేయబోతున్నట్టుగా తెలిసింది. అయితే అలా అని వెంటనే టికెట్లు కొనకండి. ఇది ఓటిటి కోసమట. భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ తమ సబ్ స్క్రైబర్స్ కోసం ఏదైనా స్పెషల్ గా ఇద్దామనే ప్రతిపాదన తెచ్చినప్పుడు దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్తగా తోడయ్యేవాటిలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు విక్రమ్ రాథోర్ కు సంబంధించిన ముఖ్యమైన సీన్లు కొన్ని ఉంటాయట.
సరే ఎప్పుడని అడిగితే మాత్రం కొంచెం వెయిట్ చేయక తప్పేలా లేదు. అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన ఎనిమిది వారాల తర్వాత జవాన్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంటున్నారు. అంటే అరవై రోజులు. పఠాన్ ఫిఫ్టీ డేస్ కి ఇచ్చేశారు. దీనికి కూడా డిలీటెడ్ సీన్స్ జోడించామని చెప్పారు కానీ అవి కేవలం నాలుగు నిమిషాలే ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ జవాన్ కు అలా కాదు. ఏకంగా ట్వంటీ మినిట్స్ అంటే చిన్న విషయం కాదు పెద్ద పంగడే. డిజిటల్ వర్గాల సమాచారం మేరకు అన్ని బాషల జవాన్ ఓటిటి స్ట్రీమింగ్ నవంబర్ 10న ఉండొచ్చని తెలిసింది.
This post was last modified on September 18, 2023 3:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…