బిగ్‍ బాస్‍: ఈసారి అన్నీ టీవీలోనే!

బిగ్‍బాస్‍ సీజన్‍ 4 మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఆల్రెడీ కంటెస్ట్లెను హోమ్‍ క్వారంటైన్‍కి పంపించారు. పధ్నాలుగు రోజుల క్వారంటైన్‍ ముగిసిన తర్వాత వాళ్లంతా బిగ్‍బాస్‍ హౌస్‍లోకి వెళతారు. హౌస్‍లోకి వెళ్లే వాళ్లు తప్ప మరెవరూ వీరితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవరు.

హోస్ట్ నాగార్జున కూడా వీరిని స్టేజీపై పరిచయం చేయబోవడం లేదు. అసలు ఈసారి ఎప్పటిలా ఆడియన్స్ ని ఆహ్వానించే స్టేజ్‍ వుండదు. మొత్తం ఇన్‍డోర్స్లోనే ప్లాన్‍ చేసారు. వివిధ సెలబ్రిటీలను షోకి ఆహ్వానించడం కూడా వుండదు.

కాకపోతే ప్రమోషన్స్ కోసం వచ్చే వారిని వీడియో కాల్స్ ద్వారా బిగ్‍ బాస్‍ హౌస్‍ సభ్యులతో మాట్లాడిస్తారు. కుటుంబ సభ్యులను పిలిచే కార్యక్రమం కూడా వుండదు. అది కూడా వీడియో కాల్‍ ద్వారానే జరుగుతుంది. ఈసారి బిగ్‍ బాస్‍ షో రసవత్తరంగా వుండే అవకాశముంది.

ఎందుకంటే గతంలో బయటి వాళ్లు వచ్చి లీకులు ఇవ్వడంతో ఎవరు లీడింగ్‍లో వున్నారనేది హౌస్‍లో వాళ్లకు తెలిసిపోయేది. తదననుగుణంగా వారు తమ గేమ్‍ ప్లాన్‍ మారుస్తూ వుండేవాళ్లు. కానీ ఈసారి అలా లీక్స్ ఇచ్చే వీలుండదు. అలాగే బిగ్‍బాస్‍ ఎలిమినేషన్‍ సంగతులు కూడా ముందే లీక్‍ అయ్యే ఛాన్సుండదు.