టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ప్రతిభతో మంచి స్థాయిని అందుకున్న యువ కథానాయకుల్లో విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టిల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ హీరోలుగా బ్రేక్ అందుకోవడానికి ముందు అవకాశాల కోసం బాగానే కష్టపడ్డారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టిది మామూలు కష్టం కాదు. విజయ్‌కి అయినా పెళ్ళిచూపులు మూవీతో కొంచెం ముందుగానే బ్రేక్ వచ్చింది కానీ.. నవీన్ మాత్రం హీరోగా తొలి అవకాశం, సక్సెస్ కోసం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది.
చివరికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ఐతే నవీన్, విజయ్ ఇద్దరూ కూడా చాలా ఏళ్ల కిందటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం విశేషం. నిజానికి వాళ్లిద్దరూ కూడా ఆ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లింది హీరో వేషాల కోసమే అట.
కానీ హీరోలుగా వేరే వాళ్లను ఎంపిక చేసి.. తమకు క్యారెక్టర్ రోల్స్ ఇవ్వడంతో చాలా బాధ పడ్డామని.. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ మీట్లో నవీన్ చెప్పుకొచ్చాడు. అయినా నిరాశ చెందకుండా తామిద్దరం వచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడున్న స్థితికి తామిద్దరం రావడానికి ప్రేక్షకుల ఆదరణే కారణమని.. తాను, విజయ్ ఇప్పటికీ పరస్పరం మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటామని నవీన్ తెలిపాడు.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముందు తాను చాలా కష్టపడ్డానని.. తిండి లేక కడుపు మాడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయని నవీన్ తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లు అన్నింటికీ సిద్ధపడే రావాలని అతనన్నాడు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నపుడు తాను షాకయ్యానని.. ఆ బాధ నుంచి బయటికి రావడానికి తనకు రెండు నెలలు టైం పట్టిందని నవీన్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on September 18, 2023 9:04 am
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…