నిన్న రాత్రి నుంచి గేమ్ చేంజర్ పాట లీక్ తాలూకు పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మంచి క్వాలిటీతో ఒక సాంగ్ ఇలా బయటకి రావడం ఖచ్చితంగా ఇంటి దొంగల పనేనన్నది స్పష్టం. ఆడియో కంపెనీలకు ఒరిజినల్ ట్రాక్స్ ఇవ్వకుండానే బయటికి వచ్చాయంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఫైనల్ వెర్షన్ కాదనే కామెంట్ వినిపిస్తున్నా జరగాల్సిన డ్యామేజ్ ట్రోలింగ్ రూపంలో అయిపోతోంది. మాములుగా ఒక కొత్త పాటని లిరికల్ వీడియో రూపంలో చూస్తేనే దాని బ్యూటీ జజనాలకు కనెక్టవుతుంది. అంతే తప్ప రఫ్ ఆడియోలో ఆ ఇంపాక్ట్ ఉండదు.
కానీ ఫ్యాన్స్ కి ఆ లెక్కలన్నీ అవవసరం. వాళ్లకు వినిపించింది చెప్పిందే నమ్ముతారు. సో తమన్ కంపోజింగ్ కి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ వ్యవహారం పట్ల దిల్ రాజు టీమ్ ప్రస్తుతానికి వెనుకుండి లింక్స్ ని డిలీట్ చేయించడం తప్ప ముందుకొచ్చి ఎలాంటి ఖండించే ప్రకటన చేయలేదు. దర్శకుడు శంకర్ తో ఫోన్ సంభాషణలో భాగంగా ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఎక్కడ జాగ్రత్త తీసుకోవడంలో ఫెయిలవుతున్నామని పరస్పరం చర్చించుకున్నారట. తమన్ సైతం ఇదే కాల్ లో కాన్ఫరెన్స్ రూపంలో మాట్లాడాడని ఇన్ సైడ్ టాక్.
ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఒకటుంది. వీలైనంత త్వరగా దీని ఫైనల్ వెర్షన్ సిద్ధం చేసి అధికారికంగా విడుదల చేయడం. తద్వారా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టినట్టు ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోకుండా ఇలా పాటలు వదిలితే ఇంకో రిస్క్ ఉంది. ఆడియో వచ్చినా ఇంకా డేట్ అనౌన్స్ చేయరా అంటూ అభిమానులు ఒత్తిడి తెస్తారు. ఈ గోల ఉండకూడాదనే దిల్ రాజు బయట వేదికలపై ఎంత ప్రెజర్ చేసినా గేమ్ చేంజర్ అప్డేట్స్ గురించి నోరు విప్పకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వ్యవహారం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఏదొక నిర్ణయం తీసుకోవాల్సిందే.
This post was last modified on September 16, 2023 2:15 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…