Movie News

ఛాంగురే బంగారురాజా ఎలా ఉంది

నిన్న రిలీజైన సినిమాల్లో డబ్బింగ్ బొమ్మ మార్క్ ఆంటోని మినహాయించి మిగిలినవన్నీ చిన్నవే కావడంతో వాటి మీద ప్రేక్షకులకు పెద్దగా ఫోకస్ రాలేదు. ఉన్నంతలో మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించిన ఛాంగురే బంగారురాజా మీదే కాస్తో కూస్తో అంచనాలు నెలకొన్నాయి. ఆయనే దగ్గరుండి ప్రమోషన్లు చూసుకోవడంతో ఎంతో కొంత మ్యాటర్ ఉంటుందనే నమ్మకంతో థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ లేకపోలేదు. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీలో కార్తీక్ రత్నం, సత్య ప్రధాన పాత్రలు పోషించగా సీనియర్ క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. ఇంతకీ బొమ్మ ఎలా ఉంది.

మెకానిక్ పనులు చేసుకునే బంగార్రాజు(కార్తీక్ రత్నం)కు దూకుడెక్కువ. తనుండే ఊరు దుగ్గాడ రంగురాళ్లు, వజ్రాలకు ప్రసిద్ధి. వర్షం పడితే చాలు జనాలంతా వాటి వేటలో పడతారు. బంగార్రాజుతో గొడవపడ్డ అతని స్నేహితుడు సోమినాయుడు(రాజ్ తిరందాసు) అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కాస్తా హీరో మీద పడుతుంది. ఈ కేసుకి తాతారావు(సత్య), గాటీ(రవిబాబు)లకు కనెక్షన్ ఉంటుంది. అసలు నేరస్థుడిని పట్టుకోవడమే బంగార్రాజు లక్ష్యంగా మారుతుంది. కథపరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. ఇదే తరహా లైన్ తో మొన్న నెలే ఇంకో చిన్న బడ్జెట్ సినిమా వచ్చింది.

దర్శకడు సతీష్ వర్మ కథనం ప్లస్ కామెడీని నమ్ముకున్నాడు కానీ వాటిని సరైన రీతిలో బ్యాలన్స్ చేయడంలో తడబడటంతో ఛాంగురే బంగారురాజా నత్తనడకన సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతుంది. కాసిన్ని జోకులు నవ్వించినప్పటికీ పాత్రలను కనెక్ట్ చేయడం, ఎమోషన్స్ రిజిస్టర్ చేయడం లాంటి అంశాల్లో పూర్తిగా తేలిపోయాడు. సస్పెన్స్ ని విప్పే క్రమం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో చంపినవాడు ఎవరనే ఆసక్తి కూడా ఫస్ట్ హాఫ్ కే చచ్చిపోతుంది. మణిరత్నం యువ స్టైల్ లో మూడు పాత్రల కోణం నుంచి రిపీట్ సీన్లతో ఇలాంటి స్టోరీ చెప్పాలనుకోవడం బ్లండర్. దానికి తగ్గ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. 

This post was last modified on September 16, 2023 10:40 am

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

11 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

30 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago