Movie News

డుంకీ గురించి తేల్చి చెప్పేశాడు

ఇప్పుడు చేస్తున్న పఠాన్, జవాన్ లాంటి మాస్ మసాలా సినిమాల సంగతి పక్కనపెడితే షారుఖ్ ఖాన్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా విపరీతమైన అంచనాలు పెట్టుకున్న సినిమా డుంకీ. ఇరవై సంవత్సరాల కెరీర్ లో కేవలం అయిదు చిత్రాలే తీసి అన్నీ మాస్టర్ పీసెస్ గా మలచిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడం వల్ల హైప్ కి హద్దు లేకుండా పోతోంది. అందులోనూ మొదటి సారి కలయిక కనక బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా ఉన్నాయి. మున్నాభాయ్ గా సంజయ్ దత్ క్యామియో చేయడం లాంటి ఆకర్షణలు బజ్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.

ఇదంతా బాగానే ఉన్నా డుంకీ డిసెంబర్ 22 రావడం సాధ్యపడదని బాలీవుడ్ మీడియా వారం నుంచి కోడై కూస్తోంది. అయితే తాజాగా కింగ్ ఖాన్ నుంచే అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చేసింది. ముంబైలో ఇవాళ జరిగిన గ్రాండ్ సక్సెస్ మీట్ లో షారుఖ్ డుంకీ గురించి కుండ బద్దలు కొట్టేశాడు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకులకు కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పేశారు. సో డిసెంబర్ 22 రావడం కన్ఫర్మ్ అయ్యింది. వరల్డ్ వైడ్ ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డంకి అదే నెల 20న భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతున్న నేపథ్యంలో డుంకీ దాన్ని ఏ మాత్రం లెక్క చేయకపోవడం విశేషం.

ఇప్పుడు స్పష్టత వచ్చేసింది కాబట్టి మిగిలిన నిర్మాతలు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు వరకు చూసుకుంటే క్రిస్మస్ ని వెంకటేష్, నాని, నితిన్ లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదో ఒకటి జనవరికి వెళ్తుందనే ప్రచారం ఉంది కానీ ఎవరికి వారు సైలెంట్ గా ఉండి జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారు. డుంకీ ఎలాగూ ఫిక్స్ అయిపోయింది కనక ఓవర్సీస్ లో థియేటర్ కౌంట్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాల రికార్డుని షారుఖ్ మిస్ అవుతాడేమోనని ఫీలైన ఫ్యాన్స్ ఇక హ్యాపీగా రిలాక్స్ అవ్వొచ్చు.

This post was last modified on September 15, 2023 8:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

45 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago