ఇటీవలే కన్నడలో విడుదలై సంచలన విజయం సాధించిన సప్తసాగర దాచె ఎల్లో ఎట్టకేలకు తెలుగులో సప్తసాగరాలు దాటి పేరుతో డబ్బింగ్ చేసి వచ్చే సెప్టెంబర్ 22న విడుదల చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. 777 చార్లీ, అతడే శ్రీమన్నారాయణతో మన ప్రేక్షకులకు పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా హైదరాబాద్ లో రెండు వారాలకు పైగా పరిమిత షోలతోనూ మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
టైమింగ్ పరంగా సప్తసాగరాలు దాటి మంచి డేట్ తీసుకుంది. 22వ తేదీ చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అష్టదిగ్బంధనం, రుద్రంకోట, తంతిరం, చీటర్, వారేవా జతగాళ్ళు లాంటి చిన్న చిత్రాలే రేస్ లో ఉన్నాయి. టాక్ మీద నిలవాలి తప్పించి బజ్ లేదు. ఉన్నంతలో రీ రిలీజ్ అవుతున్న 7జి బృందావన కాలనీకు క్రేజ్ కనిపిస్తోంది. సో ఆడియన్స్ కి సప్తసాగరాలు దాటి మంచి ఆప్షన్ అవుతుంది. పీపుల్స్ బ్యానర్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్క్రీన్ కౌంట్ ఎంత కావాలన్నా దొరుకుతుంది. అయితే ఇంత హెవీ ఎమోషనల్ కంటెంట్ మన జనాలకు కనెక్ట్ అవ్వాలి.
సప్తసాగరాలు దాటిలో ఇది మొదటి భాగమే. సెకండ్ పార్ట్ అక్టోబర్ 20 వస్తుంది. ఒకవేళ తెలుగు డబ్బింగ్ హిట్ అయితే కొనసాగింపు మాత్రం వచ్చే నెల ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి మాస్ బొమ్మల మధ్య ఈ సీక్వెల్ నెగ్గుకురావడం అంత సులభంగా ఉండదు. ఏదైనా సరే ఇప్పుడీ ఫస్ట్ పార్ట్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి రెండో భాగం త్వరగా తీసుకురావాలా వద్దానే నిర్ణయం తీసుకుంటారు. ఒక కార్ డ్రైవర్, వర్ధమాన గాయనికి మధ్య జరిగే ప్రేమకథగా హేమంత్ రావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో రూపొందించారు.
This post was last modified on September 15, 2023 5:20 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…