సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు కొంచెం ఎక్కువే అన్నది వాస్తవం. సినిమాల ఫలితాల్లో తక్కువ పాత్ర ఉండే హీరోయిన్ల విషయంలోనూ సెంటిమెంట్లను బాగా పాటిస్తుంటారు ఇక్కడి జనాలు. వరుసగా రెండు మూడు హిట్లు పడగానే టాలెంట్‌తో సంబంధం లేకుండా గోల్డెన్ గర్ల్ అని ఆకాశానికి ఎత్తేయడం.. అదే సమయంలో వరుస ఫ్లాపులు రాగానే ఐరెన్ లెగ్ అని ముద్ర వేయడం ఇక్కడ మామూలే. కానీ అందరూ ఇదే దృష్టితో ఉంటారని చెప్పలేం.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వస్తే.. కథానాయికగా కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న శ్రుతి హాసన్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’కు హీరోయిన్‌గా ఎంచుకోవడం మీద అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా ఒక ప్రముఖ నిర్మాత తనను పిలిచి.. వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్న శ్రుతిని కథానాయికగా పెట్టుకోవడం మీద హెచ్చరించాడని.. అది తనకెంతో బాధ కలిగించిందని.. తాను టాలెంట్ మాత్రమే చూస్తానని, వేరే విషయాలు పట్టించుకోనని చెప్పాడు హరీష్.
కట్ చేస్తే ‘గబ్బర్ సింగ్’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో.. ఈ సినిమా తర్వాత శ్రుతి ఎంత బిజీ అయిందో అందరికీ తెలిసిందే. ఐతే వర్తమానంలోకి వస్తే.. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మళ్లీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కథానాయిక పాత్రకు ‘ఏజెంట్’ భామ సాక్షి వైద్యను ఎంచుకోవడం తెలిసిందే.
ఐతే ‘ఏజెంట్’తో పాటు సాక్షి లేటెస్ట్ రిలీజ్ ‘గాండీవధారి అర్జున’ డిజాస్టర్ కావడంతో ఆమెను నెగెటివ్ సెంటిమెంట్‌గా భావించి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి తప్పిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సాక్షి ఈ సినిమాకు సూట్ కాదని ఆమెను తప్పిస్తే ఓకే కానీ.. వరుసగా రెండు డిజాస్టర్లు పడ్డాయని ఆమె మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి బయటికి పంపిస్తుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అప్పట్లో శ్రుతి గురించి అలా అన్న హరీష్ శంకర్.. ఇప్పుడు ఇలా చేస్తాడని అనుకోలేం. మరి వాస్తవం ఏంటో చూడాలి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా…
26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై…