భాషతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా ఓకే చెప్పే దుల్కర్ సల్మాన్ కి ఇటీవలే కింగ్ అఫ్ కొత్త పెద్ద షాకే ఇచ్చింది. కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా సుమారు పాతిక కోట్ల దాకా నష్టం మిగిల్చి ప్యాన్ ఇండియా ఆశలను ఆవిరి చేసింది. కెజిఎఫ్ ఫార్ములాతో ఏదో చేయబోయి దర్శకుడు బోర్లా కొట్టించేశాడు. అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు ఇమేజ్ కొచ్చిన నష్టం ఏమి లేదు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో మాత్రం దుల్కర్ చాలా స్పెషల్ గా నిలుస్తున్నాడు. కేవలం మార్కెట్ కోణంలోనే కాకుండా తనుంటే సినిమాకు మరింత యాక్టింగ్ ఫ్లేవర్ తోడవుతుందనే ఉద్దేశంతో దర్శకులు పాత్రలను డిజైన్ చేస్తున్నారు
ప్రాజెక్ట్ కెలో తాను ఉన్నది నిజమే అయినా అది చెప్పి చెప్పకుండా తప్పించుకున్న దుల్కర్ దర్శకుడు నాగ అశ్విన్ తో మహానటి టైంలో ఏర్పడ్డ బాండింగ్ వల్ల లెన్త్ ఎంతనేది అడగకుండా నటించాడని ఆల్రెడీ టాక్ ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు భాగమైన మల్టీస్టారర్ లో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో రూపొందబోయే యాక్షన్ డ్రామాలోనూ దుల్కర్ ఉన్నాడట. ఇవి కాకుండా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో సూర్య చేయబోయే మూవీలోనూ దుల్కర్ ఉన్నాడని చెన్నై టాక్.
ఇలా ఒకేసారి రెండు మూడు ఇతర బాషల కమిట్మెంట్లు ఇస్తున్న దుల్కర్ అలా అని మలయాళంని నిర్లక్ష్యం చేయడం లేదు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయనిదే ఇంటికి రావొద్దని తండ్రి మమ్ముట్టి క్రమం తప్పకుండ హెచ్చరిస్తూ ఉంటారట. మితిమీరిన జాప్యంతో ఏళ్ళ తరబడి ఒక మూవీ మీద ఉండటం హీరో కెరీర్ కి అంత మంచిది కాదని, అది తాను పాటించడం వల్లే ఇండియాలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో వందల సినిమాలు చేశానని చెబుతారట. నాన్న మాటను తూచా తప్పకుండ పాటిస్తున్న దుల్కర్ ఆ కారణంగానే నిడివి కన్నా ముందు కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తున్నాడు.
This post was last modified on September 14, 2023 11:34 am
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…