ఆరోగ్యం సహకరించకపోయినా ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు చేసిన సమంతాకు 2024 చేదు జ్ఞాపకాలే ఇచ్చింది. శాకుంతలం దారుణమైన డిజాస్టర్ గా నిలవగా ఖుషి సైతం చివరికి ఫ్లాప్ గా మిగిలింది. మొదటి మూడు రోజుల హడావిడికే పరిమితమై తర్వాత పూర్తిగా నెమ్మదించి ఫైనల్ రన్ కు వచ్చేసింది. ఇక తను ఎదురు చూస్తున్న రిలీజ్ సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్. వరుణ్ ధావన్ జోడిగా ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మీద అమెజాన్ ప్రైమ్ భారీ ఎత్తున వందల కోట్ల పెట్టుబడి పెట్టింది.
వీటి సంగతలా ఉంచితే ప్రస్తుతం తనను పట్టి పీడిస్తున్న రుగ్మత నుంచి క్రమంగా కోలుకుంటున్న సామ్ త్వరలో ఫుల్ లెన్త్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం తలుపు తట్టినట్టు ముంబై టాక్. పవన్ కళ్యాణ్ పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికోసమే కండల వీరుడు గుండు కొట్టించుకున్నాడు. మిలిటరీ ఆఫీసర్ గా చాలా పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశారట. టైగర్ 3 బ్యాలన్స్ వర్క్, ప్రమోషన్లు పూర్తి కాగానే దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
అయితే సమంతాను ఖచ్చితంగా ఓకే చేశారా లేదానేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. వరస ఫ్లాపుల దెబ్బకు సామ్ మార్కెట్ మీద కొంత ప్రభావం పడిన మాట వాస్తవమే. పైగా ఖుషిలో లుక్స్ పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకున్న సమంతాకు సల్మాన్ సరసన ప్రాజెక్టు ఓకే అయితే మరిన్ని ఆఫర్లు పట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా తరహాలో అక్కడి స్టార్ హీరోలతో జోడి కట్టొచ్చు. యశోద, సిటాడెల్ లో ఫైట్లు చేసేందుకు వెనుకాడని సామ్ కు ఈ సినిమాలో కూడా అలాంటి స్టంట్లు ఉంటాయని సమాచారం.
This post was last modified on September 14, 2023 11:35 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…