మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 80వ దశకంలో ఆంధ్రా ప్రాంతాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు.
కానీ ఈ మధ్య చిత్ర బృందంలో పునరాలోచన మొదలైంది. ‘సలార్’ సెప్టెంబరు 28 నుంచి వాయిదా పడటంతో ఆ వీకెండ్‌ను వాడుకుందామని చూశారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఒక వారం పాటు ఈ టార్గెట్‌తోనే పని చేసింది చిత్ర బృందం. అందుకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట తాలూకు ప్రోమోల్లో దసరా రిలీజ్ గురించి ప్రస్తావనే లేదు. అలా అని కొత్త డేట్ కూడా ఇవ్వలేదు.
డిస్ట్రిబ్యూటర్లకు కూడా ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరాకు రాదన్నట్లుగా హింట్ ఇచ్చారు. ఈ సమాచారంతో దసరాకు షెడ్యూల్ అయిన ‘భగవంత్ కేసరి’, ‘లియో’ చిత్రాల టీమ్స్ సంతోషించాయి. వాటికి మరింతగా థియేటర్ల బుకింగ్స్ జరిగాయి. తీరా చూస్తే ‘టైగర్ నాగేశ్వరరావు’ను సలార్ డేట్‌కు రిలీజ్ చేయడం కష్టమని తేలింది. అలా అని తిరిగి దసరాకు రిలీజ్ వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
విడుదల తేదీ విషయంలో ఇటు చిత్ర బృందంలో, అటు డిస్ట్రిబ్యూటర్లలో అయోమయం కొనసాగుతోంది. పండుగ సీజన్ కోసమని భగవంత్ కేసరి, లియోలతో పోటీ పడటం కరెక్టా లేక ఒక వారం ముందుగా సోలోగా రిలీజ్ చేయడం మంచిదా అనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సోలో రిలీజ్ కోసం క్రేజీ డేట్‌ను వదిలేయడం మీద తర్జన భర్జనలు నడుస్తున్నాయి. మరి ‘టైగర్’ ఏ రోజు ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి.
This post was last modified on September 13, 2023 8:17 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…