Movie News

త్వరగా డబ్బింగ్ చేసి వదలండి స్వామి

ఏ భాషలో తీసినా కొన్ని సినిమాలు సోల్ పోకుండా ఉండాలంటే వాటిని డబ్బింగ్ ద్వారానే ఇతర ప్రేక్షకులకు అందించాలి. ప్రతిసారి అన్నింటికి రీమేక్ సూత్రం పనికి రాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో చేసిన ఆర్టిస్టుల స్థాయిలో మళ్ళీ అలాంటి క్యాస్టింగే దొరక్కపోవచ్చు. 96ని ఏరికోరి మరీ జానుగా తెలుగులో తీసిన చేదు అనుభవాలు మనకు చాలానే ఉన్నాయి. సరే అనువాదమైనా సరే వీలైనంత త్వరగా వాటిని ఇవ్వగలిగితే నిర్మాతలకు కాసిన్ని డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంత మంచి టాక్ వచ్చినా కొన్నింటి విషయంలో నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదు.

ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళంలో రెండు అద్భుత విజయం సాధించిన చిత్రాలున్నాయి. మొదటిది శాండల్ వుడ్ లో వచ్చిన సప్తసాగర దాచే ఎల్లో సైడ్ ఏ. హృదయాలను మెలితిప్పే ఎమోషన్ తో దర్శకుడు దీన్ని తీర్చిదిద్దిన తీరు చూసిన ప్రతి ఒక్కరితో వాహ్ అనిపించుకుంది. నెరేషన్ కొంత స్లోగా అనిపించినా కథ డిమాండ్ ప్రకారం ఆ మాత్రం ఉండాలి. 777 ఛార్లీ ఫేమ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ భావోద్వేగాల సమ్మేళనం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ట్విట్టర్ లో కొందరు ఫ్యాన్స్ డబ్బింగ్ గురించి అడిగితే అదే పనిలో ఉన్నామని చెప్పాడు రక్షిత్

ఇక మల్లువుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ఆర్డిఎక్స్(RDX) అవుట్ అండ్ అవుట్ థ్రిల్ ఇచ్చే యూత్ యాక్షన్ డ్రామా. ముగ్గురు కుర్రాళ్ల మధ్య బంధాన్ని, వాళ్లకు శత్రువుతో ఉన్న రివెంజ్ ని బ్యాలన్స్ చేస్తూ తీసిన తీరు విజిల్స్, కలెక్షన్స్ రెండూ తెప్పించుకుంది. మన ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. వీటిని సరైన టైంలో డబ్ చేసి ఈ సెప్టెంబర్ 15 విడుదలకు రెడీ చేసి ఉంటే జనాలకు ఆప్షన్లు ఉండేవి. కానీ నిర్మాతల ఆలోచన ఎలా ఉందో అంతు చిక్కడం లేదు. ఓటిటిల జమానాలో డబ్బింగ్ అయినా రీమేక్ అయినా వీలైనంత ఆలస్యం చేయకూడదు. లేట్ చేస్తేనే నష్టం.

This post was last modified on September 12, 2023 2:51 pm

Share
Show comments

Recent Posts

వైన్ షాపులో బన్నీ.. ఎవరి కోసం?

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…

6 mins ago

మరణాన్ని వణికించే ‘డాకు మహారాజ్’

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…

45 mins ago

మెగా హీరో మళ్ళీ ట్రాక్ తప్పాడు

పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…

57 mins ago

బాలయ్య & బన్నీ – భలే భలే కబుర్లు

ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…

1 hour ago

ఫీడ్ బ్యాక్ వింటున్నావా దేవి

నిన్న విడుదలైన కంగువలో కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఎక్కువ శాతం ప్రేక్షకులు కంప్లయింట్ చేసిన అంశం బ్యాక్ గ్రౌండ్…

1 hour ago

లక్కీ భాస్కర్.. సాధించాడహో

ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…

4 hours ago